87 new Covid-19 cases among police personnel in Maharashtra, total infections cross 1700

1,758మంది పోలీసులకు కరోనా వైరస్.. 

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశంలో ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాటం చేస్తున్న వ్యక్తుల్లో పోలీసులు ఉన్నారు. అయితే మహారాష్ట్రలో COVID-19 కు మరో 87మంది పోలీసులు పాజిటివ్‌గా తేలారు. దీంతో రాష్ట్రంలో కరోనావైరస్ బారిన పడిన మొత్తం సిబ్బంది సంఖ్య 1,758కు చేరుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరోనా సోకిన పోలీసుల్లో 183 మంది ఉన్నతాధికారులు కాగా మరో 1575 కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. “గత 24 గంటల్లో రాష్ట్రంలోని 87 మంది పోలీసు సిబ్బంది COVID-19 పాజిటివ్‌గా తేలగా.. మొత్తం బాధిత సిబ్బంది సంఖ్య 1,758కు చేరుకుంది.

వీరిలో మొత్తం 18 మంది కరోనా కారణంగా మరణించగా.. ఇప్పటివరకు 673 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 47,190 కరోనావైరస్ కేసులు నమోదవగా.. మొత్తం కేసుల్లో 13,404 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో COVID-19 కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పుటివరకు 1,577గా ఉంది.

Related Posts