కరోనా పేషెంట్లలో 76% మగాళ్లు , 24% స్త్రీలు

Submitted on 7 April 2020
76% of total corona patients are men, only 24% women

ప్రభుత్వం సోమవారం వెల్లడించిన కథనం ప్రకారం.. కరోనా పేషెంట్లలో 76శాతం మంది మగాళ్లు అయితే 24శాతం మంది మహిళలు చనిపోయిన వారిలో 73శాతం మంది మగాళ్లు అయితే మిగిలిన వారు మహిళలట. సోమవారానికి 4వేల 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 109 మృతులు సంభవించినట్లు తెలిపారు. 

వీటితో పాటు మొత్తం పేషెంట్లలో 47శాతం మంది 40ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉంటే, 34శాతం మంది 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులు. 19శాతం మంది 60ఏళ్లకు పైబడ్డ వారే. 'మృతుల్లో 63శాతం మంది 60 ఏళ్లకు పైబడ్డ వారు లేదా 40-60ఏళ్ల మధ్య వయస్కులు 30శాతం మంది, 40ఏళ్లు వయస్సున్న వాళ్లు 7శాతం మంది ఉన్నారు' అని అగర్వాల్ అన్నారు. 

కరోనాతో పాటు హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత సమస్యలతో 86 శాతం మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారిక సమాచారం ప్రకారం.. మొత్తం 4వేల 67 కేసుల్లో తబ్లిగీ జమాత్ కు వెళ్లిన వారే వెయ్యి 445కేసులు ఉన్నాయి. కేంద్రం నుంచి మొత్తం 2.94 లక్షల PPEలు ఏర్పాటు చేసి సప్లై చేసినట్లు కేంద్రం ప్రకటించింది. 

సోమవారం మంత్రుల కౌన్సిల్ సమావేశం జరగనుంది. కొవిడ్ 19 ఛాలెంజ్‌లను ఉద్దేశించి సవివరమైన గైడ్ లైన్స్ ను ఆరోగ్య శాఖ ప్రకటించింది. నేషనల్ హెల్త్ మిషన్ ఫండ్స్ నుంచి వెయ్యి 100కోట్లు రూపాయలను కేంద్ర విడుదల చేసింది. అదనంగా మరో 3వేల కోట్లను సోమవారం విడుదల చేశారు. 

Corona
Patients
Men
Women
coronavirus
corona virus

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు