వింత,విచిత్రం : వృద్ధుడి తలపై కొమ్ము..కోసి తీసేశారు

Submitted on 14 September 2019
74-year-old Madyapradesh Shyam Lal Yadav grows devil’s horn after injury

మనిషికి అహంకారం పెరిగితే అరేయ్..వాడికి కొమ్ములొచ్చాయిరా..అంటాం.కానీ నిజంగా  కొమ్ములని కాదు వారు ప్రవర్తించే తీరును బట్టి అలా అంటుంటాం. కానీ ఓ వ్యక్తిని నిజంగానే తలపై కొమ్ము మొలిచింది. అది అహంకారంతో వచ్చింది కాదు..ఆరోగ్య సమస్య వల్ల వచ్చిది.

 

కొమ్ములంటే జంతువులకు ఉంటాయి కానీ మనిషికి కొమ్ములుండటమేంటి అనుకోవచ్చు. కానీ ఓ వ్యక్తికి ఖడ్గ మృగానికి ఉన్నట్లుగా అతని తలపై కొమ్ము మొలిచింది. ఆ కొమ్ముతో ఇబ్బందులు రావటంతో కొమ్మును కట్ చేసుకుంటుంటేవాడు. కానీ అది పెరుగుతునే ఉంది. దీంతో అతడు డాక్టర్ల వద్దకు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలోని ఓ వృద్ధుడి పరిస్థితి.  

రాహి గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్‌ యాదవ్‌ అనే 74 వృద్ధుడికి కొంతకాలం క్రితం తలకు గాయమైంది. చికిత్సతో దాన్ని తగ్గించుకున్నాడు. కానీ కొంతకాలానికి గాయమైన చోట కొమ్ములాంటి ఆకారం పెరుగుతూ వచ్చింది. మొదట్లో దాన్ని శ్యామ్‌లాల్‌ పెద్దగా పట్టించుకోలేదు. కానీ అది అలా పైకి పెరుగుతుండేసరికి అందరూ అతన్ని వింతగా చూసేవారు. దీంతో ఆ కొమ్ముని శ్యామ్‌లాల్‌ ఇంట్లో ఉన్న కత్తెరతో కత్తిరించాడు. కానీ అది పెరగటం మాత్రం మానలేదు. శ్యామ్ లాల్ కట్ చేసేకొద్దీ అది పెరుగుతునే ఉండేది. అది పెద్దగా సమస్యగా తయారైంది. అందరూ అతన్ని వింతగా చూడటం..ఇదేంటీ అని ప్రశ్నించటంతో ఇబ్బందిగా మారింది. దీంతో శ్యామ్ లాల్ డాక్టర్లకు చూపించుకున్నాడు.

శ్యామ్ లాల్ తలపై కొమ్మును చూసిన డాక్టర్ల  ముందు విస్తుపోయారు. తరువాత పరీక్షలు చేశారు.  డెవిల్‌ హార్న్‌ సమస్యగా గుర్తించారు. అనంతరం సర్జరీ చేసి ఆ కొమ్ములాంటి ఆకారాన్ని తొలగించారు. దీంతో శ్యామ్ లాల్ సంతోషం వ్యక్తంచేశాడు. ఈ కొమ్ముతో ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద ఇబ్బందిగా ఉండేదనీ..తనను అందరూ వింతగా చూసేవారనీ ఇప్పుడు తానకు ఆ సమస్యల లేదని ఆనందం వ్యక్తంచేశాడు. 

74-year-old
Madyapradesh
Shyam Lal Yadav
grows devil’s

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు