7-months-old baby dies of COVID-19 in Sangareddy

సంగారెడ్డిలో COVID-19తో పోరాడి 7నెలల పసికందు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏడు నెలల వయస్సున్న ఆడ శిశువు నీలోఫర్ హాస్పిటల్ లో మృతి చెందింది. బుధవారం నుంచి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న చిన్నారి Covid-19 పాజిటివ్ అని గురువారం తేలింది. చిన్నారి సంగారెడ్డి జిల్లాలోని హత్నోరా మండల్ కు చెందినది. బుధవారం చనిపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, బంధువులు రాకూడదని గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. 

ఆ చిన్నారితో క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారి గురించి విచారణ చేపట్టారు. వారిని క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ లోని వ్యక్తి COVID 19పాజిటివ్ గా తేలడంతో ఆ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి.. ఇన్ఫెక్షన్లు సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

మెదక్ జిల్లాలోనూ ఇద్దరికి పాజిటివ్:
పాపన్నపేట మండలానికి చెందిన కొడపాక గ్రామంలో ఉండే 4ఏళ్ల బుడ్డోడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్థారించారు. అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు గాంధీ హాస్పిటల్ కు వెళ్లాలని సూచించారు. 55ఏళ్ల వయస్సున్న మరో వ్యక్తి హాస్పిటల్ కు రావడంతో కరోనా అనుమానితుడిగా గుర్తించి గాంధీ హాస్పిటల్ కు పంపారు. 

Related Posts