మడతబెట్టే 5జీ స్మార్ట్ ఫోన్ ఇదే

Submitted on 18 February 2019
5G, foldable phones to rule the charts at Mobile World Congress

ఇప్పుడంతా డిజిటల్ మయం. గ్లోబల్ మొబైల్ మార్కెట్లను స్మార్ట్ ఫోన్లు శాసిస్తున్నాయి. అప్పట్లో 2 జీ నెట్ వర్క్ పోటీగా 3జీ స్మార్ట్ ఫోన్లు బ్రేక్ చేస్తే.. 4జీ స్మార్ట్ ఫోన్లు మొబైల్ మార్కెట్ ను షేక్ చేశాయి. ఇప్పటికే మొబైల్ మార్కెట్ బిజినెస్ ను షేక్ చేస్తున్న స్మార్ట్ ఫోన్లకు ధీటుగా సరికొత్త టెక్నాలజీతో 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. అలాంటి ఇలాంటి స్మార్ట్ ఫ్లోన్లు కాదు.. మడతపెట్టే స్మార్ట్ ఫోన్లు. మీరు విన్నది నిజమే.


ఇప్పటివరకూ హై ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు చూసి ఉంటారు. మడతపెట్టే స్మార్ట్ ఫోన్లు చూసి ఉండరు. అందులోనూ 5జీ స్పీడ్ ముందు మిగతా స్మార్ట్ ఫోన్లు ఎంతమాత్రం అందుకోలేవనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ 5జీ స్మార్ట్ ఫోన్లు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. వచ్చేవారం బర్సిలోనాలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూ సీ) 2019 వేదికగా 5జీ నెట్ వర్క్ స్మార్ట్ ఫోన్లను ప్రదర్శించనున్నారు.ఈ మొబైల్ షో.. ఫిబ్రవరి 24 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరుగనుంది. ఈ ఈవెంట్ లో 5జీ ఫోల్డబుల్ ఫోన్లను ప్రదర్శించనున్నారు.  5జీ ఇన్ ఫ్రాస్ట్రక్షర్ స్మార్ట్ ఫోన్లు మొబైల్ మార్కెటల్లోకి రావడానికి ఏడేళ్ల నుంచే ప్రయత్నాలు జరుగుతున్నప్పటీకీ అమెరికా, చైనా మధ్య పొలిటికల్ వార్ కారణంగా 5జీ నెట్ వర్క్ స్మార్ట్ ఫోన్ల ప్రాజెక్ట్ ఆలస్యమైనట్టు గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఫోరెస్టర్ వైస్ ప్రెసిడెంట్, ప్రిన్సిపల్ అనలిస్ట్ థామస్ హ్యుసన్ తెలిపారు. ఫొల్డబుల్ స్ర్కీన్ 5జీ స్మార్ట్ ఫోన్ల రాకతో స్మార్ట్ ఫోన్లు, ట్యాబెట్లు, ల్యాప్ టాప్ లకు మధ్య పోటీవాతావరణం నెలకొంటుందని  అభిప్రాయపడ్డారు.   

Read Also : వాట్సాప్ వెబ్ తరహాలో: ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్

Read Also : వాట్సాప్ గుడ్ ఆప్షన్: ఇకపై మీ పర్మిషన్ మస్ట్

5G
foldable phones
Mobile World Congress 

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు