బీహార్ లో మెదడువాపు పంజా : 48 గంటల్లో 36 మంది చిన్నారులు మృతి

Submitted on 12 June 2019
36 children died in only 48 hours with brain inflammatory symptoms in Bihar's Muzaffarpur district

చిన్నారులను కబళించే వ్యాధి మళ్లీ పంజా విప్పింది. చిన్నారుల పాలిట శాపంగా మారిన మెదడువ్యాపు వ్యాధి తన ప్రతాపాన్ని చూపుతోంది. బీహార్‌ లో మెదడువ్యాపు వ్యాధికి చిన్నారులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. పిట్టల్లా రాలిపోతున్నారు. ముజఫర్‌పూర్‌లో మెదడువాపు వ్యాధి లక్షణాలతో కేవలం 48 గంటల్లో 36 మంది పిల్లలు మృతి చెందారు. మరో 133 మంది పిల్లలు ఈ వ్యాధి లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 

చనిపోయిన చిన్నారుల్లో 90 శాతం మంది చిన్నారులు తీవ్రజ్వరం, హైపోగ్లైసీమియా (బ్లడ్ లో షగర్ లెవెల్స్ తగ్గిపోవడం) లక్షణాలున్నవారేనని వైద్యులు చెబుతున్నారు. మెదడువాపు వ్యాధితో 2018 సంవత్సరంతో పోలిస్తే..ఈ ఏడాది మరణాల సంఖ్య పెరగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ అంశంపై సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతు..ఈ వ్యాధిపై అవగాహన లేకపోవటంతో చిన్నారులు మరణిస్తున్నారన్నారు.దీనిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కాగా మెదడువాపు వ్యాధిపై చిన్నారుల మరణించటంపై ఆరోగ్య శాఖ అధికారులు ముజాఫర్పూర్ లో పర్యటిస్తున్నారు. పలు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి..పరిస్థితిని సమీక్షించారు. మెదడువాపు చిన్నారులకు సరైన వైద్యం అందించాలని బీహార్‌ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులను ఆదేశించింది.

 

36 children
died
48 hours
brain inflammatory symptoms
BIHAR
Muzaffarpur
District

మరిన్ని వార్తలు