సాహోరే బుడ్డోడా : గ్యాప్ లేకుండా గాల్లోకి 30 పల్టీలు

Submitted on 12 September 2019
30 Somersaults At A Time: Boy's Performance Impresses Twitter

కోల్ కతాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డుపై జిమ్నాస్టిక్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదే తరహాలో ఓ బుడ్డోడు గాల్లోకి పల్టీలు కొడుతూ మెలికలు తిరిగిపోతున్నాడు. కొంచెం కూడా గ్యాప్ లేకుండా గాల్లోనే 30 పల్టీలు కొట్టాడు.

పిల్లిమొగ్గలు వేస్తున్న యువకుడి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఎక్కడ రికార్టు చేశారో తెలియదు గానీ, చూసిన నెటిజన్లు.. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు, క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లేందుకు ట్యాగ్ చేస్తున్నారు.

‘అమేజింగ్.. ఆగకుండా ఒకేసారి 30 పల్టీలు చేయడం అద్భుతం. దేశంలో ఇలాంటి టాలెంట్ ఉన్న వారు అరుదుగా ఉంటారు. వీరిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’ అని ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు.

ఈ వీడియోను పోస్టు చేసినప్పటి నుంచి వేలాది వ్యూస్, లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. కామెంట్లు చేసిన చాలామంది నెటిజన్లు ఈ బుడ్డోడికి సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే.. 

Somersaults
Twitter
Boy
Kolkata school children
Union Sports Minister
Kiren Rijiju 

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు