కోట్ల మందికి ఇదే దిక్కు : 123456.. మీ పాస్‌వ‌ర్డ్‌ మాకు తెలుసు

Submitted on 22 April 2019
23 millions using this password to breached accounts, Reveals security study

ఇప్పుడంతా ఆన్ లైన్. కోట్లాది మందికి ఆన్ లైన్ అకౌంట్లు ఉంటాయి. జీమెయిల్ , ఫేస్ బుక్, బ్యాంకు అకౌంట్ ఇలా మరెన్నో అకౌంట్లు ఉన్నాయి. ప్రతి ఒక్క అకౌంట్ కి ఒక పాస్ వర్డ్ పెడుతుంటారు. మరికొందరు అయితే ఒకే పాస్ వర్డ్ ను అన్ని అకౌంట్లకు ఒకేలా వాడుతుంటారు. వేర్వేరు పాస్ వర్డులు పెడితే.. గుర్తించుకోవడం కష్టమని, ఈజీగా గుర్తుండేలా ఇంట్లోవారి పేరు, నిక్ నేమ్ లు ఇలా ఎన్నో పేర్లను తమ పాస్ వర్డులు గా పెట్టుకుంటుంటారు. దీంతో హ్యాకర్లకు కష్టం లేకుండా మీ పాస్ వర్డులు ఇట్టే దొరికిపోతున్నాయి. తద్వారా ఎంతోమంది యూజర్ల అకౌంట్లు మిస్ యూజ్ అవుతున్నాయి.
Also Read : ఐపీఎల్ ఫైనల్ హైదరాబాద్‌లో.. మే12న

జాబితాలో ఇదే టాప్ : 
మిలియన్ల మంది యూజర్లు వాడే పాస్ వర్డులను ఎంతో ఈజీగా గెస్ చేయొచ్చు అంటోంది ఓ సెక్యూరిటీ అధ్యయనం. దీని ప్రకారం.. లక్షలాది మంది యూజర్లు వాడే పాస్ వర్డుల్లో 123456 అనే పాస్ వర్డ్ టాప్ లిస్టులో నిలిచింది. యూకే నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (NCSC) అధ్యయనం ప్రకారం.. ఈజీగా గెస్ చేసే పాస్ వర్డులను ఎక్కువ మంది యూజర్లు వాడుతున్నారని, ఇదే వారి అకౌంట్లు డేంజర్ లో పడటానికి కారణమవుతోందని తెలిపింది. సైబర్ పరిజ్ఞానంపై అవగాహన లేమి కారణంగానే పాస్ వర్డులు బహిర్గతం అయ్యే ఈ పరిస్థితి తలెత్తుతోందని పేర్కొంది. 

ఫస్ట్ సైబర్ సర్వే :
పబ్లిక్ డేటాబేస్ లో ఉల్లంఘనకు గురైన అకౌంట్లలో ఎక్కువగా ఇలాంటి పదాలు, పదబంధాలు, పదాల వరుసను ఎక్కువగా వాడుతున్నట్టు NCSC తమ సర్వేలో విశ్లేషించింది. టాప్ జాబితాలో 123456 అనే పాస్ వర్డ్ ఎక్కువగా వాడుతున్నట్టు గుర్తించింది. 23 మిలియన్లు (2.3 కోట్లు) కు పైగా పాస్ వర్డ్ ల్లో 123456 అనే పాస్ వర్డ్ పెద్ద సంఖ్యలో వాడుతున్నట్టు తేలింది. రెండో స్థానంలో పాపులర్ పాస్ వర్డ్ 123456789 అనే పాస్ వర్డ్ ఉన్నట్టు సర్వే వెల్లడించింది. ఈ పాస్ వర్డ్ ను క్రాక్ చేయడానికి పెద్దగా కష్టపడక్కర్లేదని తెలిపింది. తర్వాతి టాప్ 5 స్థానాల్లో qwerty, 1111111 పాస్ వర్డ్ లు ఉన్నాయి. 

ఫుట్ బాల్ టీమ్ పేర్లు కూడా :
పాస్ వర్డ్ ల్లో ఉపయోగించే పేర్లలో ఎక్కువగా వాడే కామన్ నేమ్.. Ashley తొలివరుసలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో Michael, Daniel, Jessica, Charlie వంటి పదాలను తమ పాస్ వర్డ్ లుగా ఉపయోగిస్తున్నారు. ప్రీమియర్ లీగ్ ఫుట్ బాల్ జట్లను కూడా తమ పాస్ వర్డ్ లుగా పెట్టుకుంటున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఇందులో Liverpool పేరు తొలిస్థానంలో, Chelsea రెండో స్థానంలో ఉంది. మ్యూజిక్ యాక్ట్ చార్ట్ లో  Blink-182 టాప్ లో ఉంది.

పాపులర్ అయిన పదాలను తమ పాస్ వర్డ్ లుగా పెట్టుకుంటున్న యూజర్ల అకౌంట్లు హ్యాకింగ్ కు గురై ప్రమాదం ఎక్కువగా ఉందని NCSC టెక్నికల్ డైరెక్టర్ లాన్ లేవీ తెలిపారు. తమ సెన్సిటీవ్ డేటాను సురక్షితంగా ఉండేలా గెస్ చేయని విధంగా పాస్ వర్డ్ పెట్టుకోవాలని ఎవరూ ఆలోచించడం లేదని ఆయన అన్నారు. లోకల్ ఫుట్ బాల్ టీమ్ లేదా ఫావరేట్ బ్రాండ్ల పేర్లలో తొలి పేరును తమ పాస్ వర్డ్ గా పెట్టుకుంటున్నారని తెలిపారు. హ్యాకైన అకౌంట్ ను డేటాను నిర్వహిస్తున్న సెక్యూరిటీ ఎక్స్ పర్ట్ ట్రోయ్ హంట్ మాట్లాడుతూ.. స్ట్రాంగ్ పాస్ వర్డ్ ఎంచుకుంటే.. అదే ఆన్ లైన్ సెక్యూరిటీకి సింగిల్ బిగ్గెస్ట్ కంట్రోల్ గా పనిచేస్తుందని చెప్పారు. 
Also Read : అదిరిపోయే ఫీచర్లు : Realme 3 Pro వచ్చేసింది

breached accounts
security study
NCSC
Hackers
million passwords

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు