విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు బ్లాక్‌లో విక్రయం : తిరుమలలో 23 మంది దళారీలు అరెస్ట్

Submitted on 21 October 2019
23 Brokers arrest in thirumala

తిరుమలలో 23మంది దళారీలను అరెస్ట్ చేశారు వన్‌టౌన్‌ పోలీసులు. గూడూరు ఎమ్మెల్యే లెటర్‌పై ఐదుగురికి విఐపి బ్రేక్ దర్శనానికి అనుమతి పొందిన దళారి శ్రీనివాసులు నాయుడు..ఐదు టికెట్లను.. రెండు పార్టీలకు బ్లాక్‌లో విక్రయించాడు. ఈ ఘటనలో శ్రీనివాసులు నాయుడును పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించారు. 

శ్రీనివాసులు నాయుడు ఇచ్చిన సమాచారంతో.. మరో 22 మందిని అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఇద్దరు టిటిడి ఉద్యోగులు, ఒక కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నారు. వీరంతా లడ్డూలు, గదులు, దర్శనం టికెట్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు.
 

23 Brokers
Arrest
Thirumala

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు