20ఏళ్లు జైలు శిక్ష : బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు

Submitted on 2 December 2019
20years jail for rape accuse

విజయవాడలో బాలికపై అత్యాచారం కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2017లో ఇబ్రహీంపట్నంలో కృష్ణారావు అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ కేసుని విచారించిన ప్రత్యేక కోర్టు సోమవారం(డిసెంబర్ 2,2019) తీర్పు ఇచ్చింది. పోక్సో చట్టం కింద కృష్ణారావుకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు విధించిన శిక్ష పట్ల హర్షం వ్యక్తమవుతోంది. బాధిత కుటుంబం స్వాగతించింది. అయితే ఆ మృగాడికి బతికే హక్కు లేదని, జైలు శిక్ష బదులు ఉరి శిక్ష విధించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చిన్న పిల్లలు, యువతులు, మహిళలు అనే తేడా లేదు. దేశవ్యాప్తంగా ఆడవారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మృగాళ్లు చిన్నపిల్లలను కూడా వదలడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి సేఫ్ గా వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.

వరుసగా జరుగుతున్న ఘోరాలతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నలుగురు మృగాళ్ల అఘాయిత్యం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దిశ హత్యాచార నిందితులను ఉరి తీయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అత్యాచారం కేసుల్లో నిందితులకు వెంటనే మరణ శిక్ష విధించాలని అప్పుడే మార్పు వస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Rape
ACCUSE
20 years jail
vijayawada
Ibrahimpatnam
Girl

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు