ఓటర్లు కొత్త రికార్డు క్రియేట్ చేయాలి:మోడీ ట్వీట్  

Submitted on 11 April 2019
In the 2019 elections voters will create a new record by PM Modi tweet

ఢిల్లీ:  ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా  ఈరోజు (ఏప్రిల్ 11)న  తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్ధేశించి ట్వీట్ చేశారు. ఈ సారి ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కోరారు. ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలి దశ ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లోని ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటింగ్‌లో సరికొత్త రికార్డు నమోదు కావాలి. ప్రత్యేకించి యువత, ఫస్ట్‌టైం ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.

కాగా దేశ వ్యాప్తంలో సార్వత్రిక ఎన్నికలు తొలి దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. తొలి విడతలో 20 రాష్ట్రాలలో లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగుతున్న విషయం తెలిసిదే.

Delhi. PM
Modi
twieet 2019 elections
voters
new record

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు