ఢిల్లీలో 20 ఏరియాలకు సీల్...ఫేస్ మాస్క్ లు తప్పనిసరి

Submitted on 8 April 2020
20 Coronavirus Hotspots Sealed In Delhi, Masks Made Compulsory

దేశరాజధానిలో దాదాపు 20కరోనా హాట్ స్పాట్ లను వెంటనే సీల్ వేస్తున్నట్లు ఢిల్లీ డిప్యూటీ మనీష్ సిసోడియా బుధవారం(ఏప్రిల్-8,2020)ప్రకటించారు. సీల్ వేసిన ఏరియాల్లోకి బయట నుంచి ఎవ్వరూ అనుమతించబడరని,అదేవిధంగా ఈ ఏరియాల్లో నుంచి బయటకు ఎవ్వరినీ వెళ్లనిచ్చేది లేదని సిసోడియా తెలిపారు. సీల్ వేసేందుకు గుర్తించబడిన ఏరియాల్లో సదర్ బజార్ ఏరియా కూడా ఒకటని ఆయన తెలిపారు. సీల్ పీరియడ్ కొనసాగినంత కాలం ఈ ఏరియాల్లోని ప్రజలకు నిత్యావసర వస్తువులను 100శాతం డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలిపారు.

అయితే సీల్ వేయబడునున్న మొత్తం 20 ఏరియాల ఫుల్ లిస్ట్ ఇంకా విడుదల కాలేదు. అంతేకాకుండా,ఢిల్లీలో కరోనా కేసులు 600కి చేరువలో ఉన్న నేపథ్యంలో దేశ రాజధానిలో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఫేస్ మాస్క్‌లను కూడా తప్పనిసరి చేసింద కేజ్రీవాల్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి నివాసంలో ఇవాళ జరిగిన అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్, ఇతర అధికారులు, మనీష్ సిసోడియా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఫేస్ మాస్క్ లు ధరించడం వల్ల కరోనావైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుంది. అందువల్ల, వారి ఇంటి నుండి బయటికి వచ్చే ఎవరికైనా ఫేస్ మాస్క్ లు తప్పనిసరి అని కేజ్రీవాల్ తెలిపారు. క్లాత్ మాస్క్‌లు కూడా ధరించవచ్చని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ సాయంత్రం చెప్పారు.

మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ ఎంపీలతో కూడా కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముగ్గురు స్థానికులకు కరోనావైరస్ పాజిటివ్ రావడంతో  కనాట్ ప్లేస్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ బెంగాలీ మార్కెట్ కూడా ఈ రోజు మూసివేయబడింది. రేపు, మార్కెట్ పరిమిత సమయం వరకు తెరిచి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు మహారాష్ట్ర,ఉత్తరప్రదేశ్,ఛంఢీఘర్ లు కూడా ఫేస్ మాస్క్ లు తప్పనిసరి చేశాయి.(ఆర్థం చేసుకోండి...సోనియాజీ ఆ సూచన ఉపసంహరించుకోండి)

covid19
coronavirus
HOTSPOTS
Delhi
SEALED
SADAR BAZAR
Manish Sisodia
Face Masks
COMPULSORY

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు