తారక్ తొలి చిత్రానికి 18 ఏళ్లు

Submitted on 25 May 2019
18 Years For Ninnu Choodalani

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా నిన్ను చూడాలని 2001 మే 25న విడుదలైంది. 2019 మే 25 నాటికి ఈ సినిమా రిలీజ్ అయ్యి 18 సంవత్సరాలు పూర్తవుతుంది. బాలనటుడిగా అనుభవం ఉన్న నందమారి తారక రామారావు, నందమారి వంశం మూడవ తరం కథానాయకుడిగా ఈ సినిమాతోనే హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై, విఆర్ ప్రతాప్ దర్శకత్వంలో రూపొందగా, ఎన్టీఆర్ పక్కన రవీనా రాజ్‌పుత్ హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

మొదటి సినిమాతోనే ఈ కుర్రాడిలో విషయం ఉంది అనిపించుకున్నాడు ఎన్టీఆర్. రూ.50 లక్షల బడ్జెట్‌తో  నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.2 కోట్లు కలెక్ట్ చేసింది. కె.విశ్వనాథ్, కైకాల, రాళ్ళపల్లి, అన్నపూర్ణ, శివాజీ రాజా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఎస్.ఏ.రాజ్ కుమార్ సంగీతమందించగా, వేటూరి, సిరివెన్నెల, భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, చంద్రబోస్ రాసిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరోగా తారక్ తొలి చిత్రం నందమారి అభిమానులకెప్పుడూ స్పెషల్ ఫిలిమ్ అనే చెప్పాలి. ఈ సినిమాకి కెమెరా : ఎస్.గోపాల్ రెడ్డి.
 

Jr. NTR
Raveena Rajput
S. A. Rajkumar
Ramoji Rao
V. R. Prathap

మరిన్ని వార్తలు