పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం : 14మంది మృతి

Submitted on 11 July 2019
14 killed, 79 injured  trains accident in Sadiqabad Pakistan

పాకిస్థాన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 14మంది మృతి చెందారు. మరో 79మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు రైళ్లు ఢీకొనటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనస్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. కాగా రైళ్లలో జరిగిన సాంకేతిక లోపంతో ఈ  ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.  

గురువారం (జులై11)ఉదయం అక్బర్ ఎక్స్‌ప్రెస్ సాధిఖాబాద్ వల్హర్ గ్రామం సమీపంలోకి వస్తున్న క్రమంలో అదే ట్రాక్ పై వస్తున్న గూడ్స్ ట్రైన్ ను వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణీకులు అక్కడిక్కడే మృతి చెందారు. గాయాపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతు మరో నలుగురు మృతి చెందారు.  ఈ రైలు అక్బర్ ఎక్స్‌ప్రెస్ గూడ్స్ రైలును బలంగా ఢీకొనటంతో బోగీలు ఒకదానిపై మరొకటి ఎక్కేశాయి. బోగీలను హైడ్రాలిక్ కట్టర్ల సాయంతో తొలగిస్తున్నారు.మరికొన్ని  బోగీలు పూర్తిగా ధ్వంసమైపోయాయి.

ఈ ప్రమాదంపై స్పందించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. అలాగే గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరారు. కాగా  ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పాక్ రైల్వేశాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ సంతాపం తెలిపారు. అనంతరం  మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు. గాయపడినవారికి రూ.5లక్షల పరిహారాన్ని ప్రకటించారు. ప్రమాదంపై దర్యాప్తు ఆదేశించామని తెలిపారు.  
 

Pakistan
Sadiqabad
14 killed
79 injured
Trains
Accident


మరిన్ని వార్తలు