ఒక్క అరటిపండు ఖరీదు రూ.85లక్షలు..!!

Submitted on 7 December 2019
The $120,000 Banana Wins Art Basel

కళాత్మక హృదయంతో చూస్తే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు ఓ కళాఖండమే. సాధారణ బుర్రలకు అర్థం కాని పెయింటింగ్ లను కూడా లక్షలు పోసి కొనుగోలు చేస్తుంటారు. ఇటీవల అమెరికాలోనూ ఇదే జరిగింది. ఓ వ్యక్తి గోడకు అంటించిన అరటిపండును అక్షరాల 85లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు. ఇలా ఒకటి కాదు మూడింటిని అదే భారీ మొత్తంలో కొనుక్కున్నారు. 

ఇటీవల మియామీ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలో ఇటలీకి చెందిన ప్రముఖ కళాకారుడు మౌరీజియో క్యాటెల్యాన్ కళాఖండాన్ని సృష్టించాడు. దీనికి ‘కమెడియన్’ అనే పేరు పెట్టాడు. మొత్తం మూడు అరటి పండ్లను ఈ విధంగా ప్రదర్శించగా రెండు ఇప్పటికే అమ్ముడుపోయాయి. 

 

ఇందులో అద్భుతమేమీ లేదు. సాధారణమైన అరటిపండు, టేపు మాత్రమే. కాకుంటే వాటిని అమూల్యమైన కళాఖండాల మధ్య ఉంచడంతో వీటికి క్రేజ్ వచ్చింది. పైగా దీనికి సర్టిఫికెట్ ద్వారా హక్కులు కూడా కల్పిస్తున్నారు. ఈ అరటి పండు చిత్రాన్ని ఆర్ట్ బాసెల్ మియామీ బీచ్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసింది. 

 

‘నిజమైన అరటిపండును గోడకు అతికించిన క్యాటెల్యాన్.. మొదట్లో అరటి పండు రూపంలో కళాఖండాలను తయారు చేయాలని అనుకున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్లినా.. తన హోటల్ గదిలో ఓ అరటి పండును టేపు సహాయంతో గోడకు అమర్చేవాడు. అదే స్ఫూర్తితోనే కంచుతో అరటి పండును తయారు చేశాడు. కానీ ప్రదర్శనలో నిజమైన అరటిపండునే ఉంచాడు’ అని ఆ పోస్టులో రాసుకొచ్చింది.

banana
Art Basel

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు