రాజస్తాన్‌ వ్యక్తి కడుపులో 116 మేకులు

Submitted on 15 May 2019
116 Iron Nails, Wire Removed From Man's Stomach In Rajasthan

రాజస్థాన్‌లోని కోట జిల్లా బుండీ ప్రాంతంలో ఒక వ్యక్తి పొత్తి కడుపులో 116 ఇనుప మేకులు, ఒక పొడవైన వైరు, గోలీలు ఉన్నాయి. అతనికి ఆపరేషన్‌ చేసిన ప్రభుత్వా హాస్పత్రి వైద్యులు ఇది కడుపా లేక ఇనుప వస్తువుల దుకాణమా అంటూ ఆశ్చర్యపోయారు.  

భోలా శంకర్‌ (42) అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ.. స్థానిక బుండి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఎక్స్‌ రే తీసిన వైద్యులు ఆ రిపోర్టులు చూసి ఆశ్చర్యపోయారు. అతని కడుపులో ఏవో వస్తువులు ఉన్నట్లు రిపోర్టుల్లో కనిపించింది. దాంతో ఎందుకైనా మంచిదని సీటీ స్కాన్‌ చేశారు. ఆ రిపోర్టులు కూడా తేడాగా రావటంతో వెంటనే శంకర్‌కి ఆపరేషన్‌ చేశారు.

ఆపరేషన్ చేసిన తర్వాతా అతని కడుపులోంచి 6.5 సెంటిమీటర్ల పొడవున్న 116 ఇనుప నట్లతో పాటు ఓ వైర్‌, గోలీలను కూడా బయటకు తీశారు. ప్రస్తుతం శంకర్‌ కోలుకుంటున్నాడని.. అయితే ఈ గోలీలు పేగుల్లోకి వెళ్లి ఉంటే ప్రాణానికి ముప్పు ఉండేదని వైద్యులు తెలిపారు.  

116 Iron Nails
Wire
Removed From Man's Stomach
Rajasthan CM Ashok Gehlot

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు