6 వికెట్లు పడగొట్టి దిగ్గజాల సరసన చేరిన చాహల్

Submitted on 18 January 2019
Yuzvendra Chahal wonders after 6-wicket haul

ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 2 వికెట్లు తీసి బోణీ కొట్టిన భువీ అనంతరం బాల్‌తో విజృంభించాడు. 6 వికెట్లు తీసి ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. అతనితో పాటుగా భువనేశ్వర్‌, షమీ చెరో రెండు వికెట్లు తీయడంతో మరో 8 బంతులు మిగిలుండగానే ఆసీస్‌ 230 పరుగులకు ఆలౌట్‌ అయింది. చాహల్ చక్కటి ప్రదర్శనతో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై 6 వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా రికార్డు సృష్టించాడు. 

గతంలో టీమిండియా క్రికెటర్ అజిత్ అగార్కర్ 42 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. ఇప్పుడు చాహల్ 6 వికెట్ల పడగొట్టి స్పిన్నర్లు అబ్దుల్‌ ఖాదర్‌, టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి, షేన్‌వార్న్‌, సక్లెయిన్‌ ముస్తాక్‌, జిమ్మీ ఆడమ్స్‌, బ్రాడ్‌ హాగ్‌, ఇమ్రాన్‌ తాహిర్‌‌లతో సమంగా నిలిచాడు. తొలి రెండు వన్డేల్లో కుల్దీప్‌ యాదవ్‌కు స్థానం కల్పించగా అతను అడిలైడ్‌ వన్డేలో 66 పరుగులిచ్చిన ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. దీంతో జట్టులో మార్పులు చేసిన కోహ్లీ మరో స్పిన్నర్ చాహల్‌కు అవకామిచ్చాడు. సద్వినియోగం చేసుకున్న చాహల్ సత్తా చాటాడు. కాగా, వన్డేల్లో 5 వికెట్లు తీయడం చాహల్‌కు ఇది రెండోసారి. గతేడాది దక్షిణాఫ్రికాతో జరిగిన సెంచూరియన్‌ వన్డేలో 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 

ఖవాజా, మార్ష్‌ వికెట్లను వెంటవెంటనే అవుట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టేశాడు. అయినా హ్యాండ్స్‌కాంబ్ బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టు స్కోరు 200 పరుగులు దాటిస్తుండగా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. చాహల్ ధాటికి నిలవలేని కాంబ్ 63 బంతుల్లో 2 ఫోర్లతో 58 పరుగులు చేసి 8వ వికెట్‌గా వెనుదిరిగాడు. చివరి వరుస బ్యాట్స్‌మన్ల నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో ఆసీస్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. చాహల్ చేతిలో అవుటైన వికెట్లు ఖవాజా (34), షాన్‌ మార్ష్‌ (39), మ్యాక్స్‌వెల్‌ (26), రిచర్డ్‌సన్‌ (16), ఫించ్‌ (14), సిడిల్‌ (10) పరుగులు చేశారు.
 

yuzvendra chahal
ajith agarkar
india
Australia

మరిన్ని వార్తలు