ఐ యామ్ ది రూలర్ - ‘యువరత్న’ టీజర్

Submitted on 9 October 2019
Yuvarathnaa - Official Teaser

‘పవర్ స్టార్’ పునీత్ రాజ్‌‌కుమార్, సయేషా సైగల్ హీరో, హీరోయిన్లుగా.. సంతోష్ ఆనంద్‌రామ్ దర్శకత్వంలో.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై..‘కేజీఎఫ్’ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న కన్నడ సినిమా ‘యువరత్న’.. (ది పవర్ ఆఫ్ యూత్).. రగ్బీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.

జిఆర్‌వి, ఆర్‌కే యూనివర్శిటీల మధ్య జరగబోయే ఫైనల్ రగ్బీ మ్యాచ్‌కి పునీత్ ప్రిపేర్ అవుతుండగా వాయిస్ ఓవర్‌తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రపంచంలో ‘రూల్ ఫాలోఅయ్యేవాళ్లు, రూల్ బ్రేక్ చేసేవాళ్లు, రూల్ చేసేవాళ్లు’ ఉంటారు.. నేను మూడోరకం అంటూ పునీత్ తన గురించి తను ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం.. రెయిన్ ఎఫెక్ట్‌లో మ్యాచ్‌లో ఫీట్స్ చెయ్యడం.. తనను తిట్టిన అపోజిట్ టీమ్ వ్యక్తిని కొట్టి, రగ్బీ బాల్‌తో కూర్చున్న షాట్ టీజర్‌కే హైలెట్ అయ్యింది.

Read Also : ‘థియేటర్లో మర్డర్లు ఎవరు చేస్తున్నారు’? ఎంఎంఓఫ్ - టీజర్

విజువల్స్, ఆర్ఆర్ బాగా సెట్ అయ్యాయి. త్వరలో ‘యువరత్న’ విడుదల కానుంది. సోనూ గౌడ, ధనంజయ్, సింహా, బొమన్ ఇరానీ, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి.. మ్యూజిక్ : ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ : వెంకటేష్ అంగురాజ్, ఎడిటింగ్ : జ్ఞానేష్, ఫైట్స్ : రామ్ - లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, ఎ.విజయ్.
 

Puneeth Rajkumar
Sayyeshaa Saigal
S Thaman
Hombale Films
Santhosh Ananddram

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు