వైఎస్ వివేకా మృతి : అభ్యర్థుల ప్రకటన వాయిదా

Submitted on 15 March 2019
ysrcp candidates first list postponed

వైఎస్ వివేకానందరెడ్డి మృతితో జగన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్ 2019 వెలువడడంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ మరింత బిజీ అయిపోయారు. పార్టీ అభ్యర్థుల ఖరారు, ప్రచార షెడ్యూల్‌ ఇతరత్రా విషయాలతో జగన్ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలో ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంటనే జగన్ పులివెందులకు బయలుదేరారు.

ఇదిలా ఉంటే మార్చి 15 శుక్రవారం, మార్చి 16 శనివారం రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలను రద్దు చేసుకుంది వైసీపీ. అసెంబ్లీ, ఎంపీ అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేశారు. జగన్ ఎన్నికల ప్రచారం మార్చి 17వ తేదీ నుండి మొదలు పెట్టనున్నారు. పార్టీలో చేరికలను కూడా ఎల్లుండికి (17వ తేదీ)కి పోస్టు పోన్డ్ చేశారు. 
Read Also: కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు

Ysrcp
Candidates
first list
postponed
Jagan

మరిన్ని వార్తలు