వివేక హత్యకు చంద్రబాబే కారణం : వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపణ

Submitted on 15 March 2019
YSR Congress spokes person Vellampalli Srinivas comments on chandrababu

వైఎస్‌ జగన్ పై గెలవలేకే చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. మార్చి 15 శుక్రవారం విజయవాడలోని ఆ పార్టీ కార‍్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎప్పుడైతే ఆదినారాయణరెడ్డికి కడప ఎంపీ సీటు ప్రకటించారో... అప్పుడే వివేకానందరెడ్డి హత్యకు బీజం పడిందన్నారు. గతంలో వైఎస్ జగన్‌ను కూడా హత్య చేయటానికి యత్నించారని ఆరోపించారు. చంద్రబాబు చెప్పినట్లు సిట్‌ పని చేస్తుందన్నారు. సిట్‌పై తమకు నమ్మకం లేదని.. అందుకే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 
Read Also: వివేక హత్య సూత్రదారులు చంద్రబాబు, లోకేష్, ఆదినారాయణ : విజయసాయిరెడ్డి

చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలైందని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు హత్యా రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. వివేకా హత్య వెనుక మంత్రి ఆదినారాయణరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఓట్లనే తొలగిస్తున్నారనుకున్నాం.. మనుషులనే తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలతో అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

వివేకానందరెడ్డి హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, సాక్షాత్తూ ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు, ప్రతిపక్ష నేత చిన్నాన్న హత్యకు గురయ్యారన‍్నారు.. ఇందులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు విష్ణు. వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని, ఈ విషయంలో గవర్నర్‌, రాష్ట్రపతి జోక‍్యం చేసుకోవాలని కోరారు. 
Read Also: వివేకా హత్య : ఆరోపణలు రుజువైతే నడిరోడ్డు పై కాల్చేయండి

YSR congress
spokes person
Vellampalli Srinivas
Malladi Vishnu
Comments
Chandrababu
vijayawada

మరిన్ని వార్తలు