ఇక సెలవ్: వైఎస్ వివేకా అంత్యక్రియలు పూర్తి

Submitted on 16 March 2019
YS Vivekananda Reddy Funeral Completed In Pulivendula Raja Reddy Ghat

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి మధ్యలో వైఎస్ వివేకానందకు తుది వీడ్కోలు పలికారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా ఉన్న వైఎస్ వివేకానందరెడ్డిని కడసారి చూసేందుకు వైఎస్‌ కుటుంబ అభిమానులు తరలివచ్చారు.
Read Also : కర్నూలులో కాల్పులు : టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డికి గాయాలు

వివేకానందరెడ్డి నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్‌ వరకు అంతిమయాత్ర నిర్వహించాగా.. అంతిమయాత్రలో వేలాది మంది వైఎస్ కుటుంబ అభిమానులు పాల్గొన్నారు. భారీ భద్రత మధ్యలో జగన్ తన బాబాయి అంతమ యాత్రలో పాల్గొన్నారు. ఆ సమయంలో వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉన్నారు. కడసారి చూపుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.

- 1950 ఆగస్టు 8న పులివెందులలో వివేకా జన్మించారు.
- వైఎస్ కు వివేకానందరెడ్డి చిన్న తమ్ముడు. 
- ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వివేకానందరెడ్డి పనిచేశారు. 
- తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు.
- 1989, 1994లో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
1999, 2004లో కడప పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా ఎన్నిక. 
- 2009లో ఎమ్మెల్సీగా బాధ్యతలు. 
- 2010లో కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో వ్యయసాయశాఖ మంత్రిగా బాధ్యతలు. 
- 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడు. 
- వివేకానందరెడ్డికి భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. 

ys vivekananda reddy
Completed Funeral
Pulivendula Raja Reddy Ghat
2019

మరిన్ని వార్తలు