2021 నాటికి పోలవరం పూర్తవ్వాలి : అధికారులకు సీఎం జగన్ టార్గెట్

Submitted on 20 June 2019
ys jagan visits polavaram project

తొలిసారి సీఎం హోదాలో వైఎస్ జగన్.. పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించారు. గురువారం(జూన్ 20,2019) పోలవరం ప్రాజెక్ట్ ని విజిట్ చేశారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం పనులకు సంబంధించి టార్గెట్లు ఫిక్స్ చేశారు సీఎం జగన్. పోలవరం సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. 2021 నాటికి పోలవరంలో అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈసీఆర్ఎఫ్ సహా అన్ని పనులు కంప్లీట్ చేయాలన్నారు. 2020 జూన్ నాటిక కాఫర్ డ్యాం, స్పిల్ వే పనులు మొత్తం పూర్తి చేయాలని అధికారులతో చెప్పారు. 2020లో గ్రావిటీలో నీళ్లు ఇచ్చేలా పనులు జరగాలన్నారు.

కాఫర్ డ్యామ్ పనులు పూర్తి కాకపోవడంపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద వచ్చేనాటికి కాఫర్ డ్యామ్ పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించారు. అనుకున్న సమయానికి కాఫర్ డ్యామ్ పూర్తి చేయకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది కదా అని అధికారులను నిలదీశారు. ప్రాజెక్టుకి సంబంధించి జగన్ అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. గత ప్రభుత్వంలా పోలవరంపై ఆర్భాటపు ప్రకటనలు చేయకుండా పనులపై ఎక్కువ దృష్టి పెట్టాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు ప్రాజెక్ట్ ఎంతవరకు పూర్తయింది.. ఇంకా ఎంత పని జరగాల్సి ఉంది వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే టెండర్స్, కాంట్రాక్టర్ల వివరాలను కూడా జగన్ అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి తనకున్న సాంకేతిక సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఇప్పటివరకు పునరావాస చర్యలపై అసలు దృష్టి పెట్టకపోవడంతో.. ఆ దిశగా చర్యలను వేగవంతం చేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. జగన్ పోలవరం సందర్శన నేపథ్యంలో అక్కడి ముంపు ప్రాంత రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు. సీఎం జగన్ ని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు కలిశారు. ఇళ్ల నిర్మాణం, నష్టపరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై వినతి పత్రం సమర్పించారు. వారి సమస్యలను విన్న సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని నిర్వాసితులకు హామీ ఇచ్చారు.

polavaram project
cm ys jagan
Visit
target
works
construction
polavaram progress

మరిన్ని వార్తలు