జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

Submitted on 25 May 2019
ys jagan swearing in ceremony will be in vizayawada

ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహనరెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం(మే-30,2019) మధ్యాహ్యాం 12గంటల 23నిమిషాలకు జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం అధికారులను ఆదేశించారు.పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ దిశానిర్దేశం చేశారు.
ఇవాళ మధ్యాహ‍్నం అధికారులతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డీజీపీ ఆర్పీ ఠాకూర్‌, జీఏడీ అధికారులు హాజరు అయ్యారు. లా అండ్‌ ఆర్డర్‌ డీజీ రవిశంకర్‌ అయ్యనార్‌, విజయవాడ సిటీ కమిషనర్‌ ద్వారక తిరుమలరావు, ఇంటెలిజెన్స్‌ ఏడీజీ కుమార విశ్వజిత్‌, అగ్నిమాపక శాఖ డీజీ సత్యనారాయణ, ఏలూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ, గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, గుంటూరు జిల్లా రూరల్‌ ఎస్పీ రాజశేఖర బాబు, కృష్ణాజిల్లా కలెకర్ట్‌ ఇంతియాజ్‌, కృష్ణాజిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
 

Ys Jagan
vizayawada
muhurtham
fix
indiragandhi muncipal stadium
swearing in ceremony

మరిన్ని వార్తలు