శాశ్వత బీసీ కమిషన్, రూ.75వేల కోట్లు : జగన్ వరాల జల్లు

Submitted on 17 February 2019
YS Jagan Showers Sops On BC Community, Eluru BC Garjana

ఏలూరు: ఎన్నికల వేళ వైసీపీ చీఫ్ జగన్.. బీసీలపై వరాల జల్లు కురిపించారు. బీసీ ఓటర్లను ఆకట్టుకునే విధంగా హామీలు ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బీసీ గర్జనలో జగన్ బీసీ  డిక్లరేషన్ ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, అది నిరంతరం పని చేసేలా చట్టబద్దత కల్పిస్తామని జగన్ చెప్పారు. బీసీ కమిషన్ పరిధిని విస్తరిస్తామన్నారు. మూడో వంతు నిధులు బీసీలకు కేటాయిస్తామని జగన్ హామీ ఇచ్చారు. బీసీల్లోని అన్ని ఉపకులాల వారికి 139  కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు. బీసీల అభివృద్ధి కోసం ఏటా రూ.15వేల కోట్లు(ఐదేళ్లకు రూ.75వేల కోట్లు) కేటాయిస్తామని జగన్ అన్నారు.

 

తెలంగాణలో 32 కులాలను బీసీ జాబితా నుంచి తీసేశారని జగన్ అన్నారు. హరికృష్ణ శవం పక్కన పెట్టుకుని కేటీఆర్‌తో పొత్తులు మాట్లాడొచ్చు కానీ బీసీ జాబితా నుంచి తొలగించిన 32కులాల  గురించి మాట్లాడరు అని సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తాను మాట్లాడతానని, 32కులాలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నం చేస్తానని  జగన్ వాగ్దానం చేశారు.

 

బీసీలపై జగన్ వరాలు:

* అధికారంలోకి రాగానే కార్పొరేషన్ల వ్యవస్థ ప్రక్షాళన
* శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు
* నిరంతరం బీసీ కమిషన్ పనిచేసేలా చట్టబద్ధత
* బీసీ కమిషన్ పరిధి విస్తరణ
* బీసీ సమగ్ర సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత
* బీసీల కోసం మూడో వంతు నిధులు
* అన్ని కులాలకు కార్పొరేషన్లు
* నిర్లక్ష్యానికి గురయ్యామనే భావన బీసీల్లో లేకుండా చేస్తాం
* కార్పొరేషన్ల ద్వారా బీసీలకు నేరుగా రుణాలు అందేలా చర్యలు
* బీసీలోని అన్ని ఉపకులాల వారికి 139 కార్పొరేషన్లు
* బీసీ విద్యార్థులకు చదవుల కోసం ఎన్ని లక్షల ఖర్చైనా భరిస్తాం
* ప్రతి కులాన్ని అభివృద్ధి చేసేందకు చర్యలు
* 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సున్న బీసీ అక్కలకు వైస్ఆర్ చేయూత పథకం కింద రూ.75వేలు
* పేదల పిల్లలకు ఉచితంగా విద్య
* హాస్టల్‌లో ఉండి చదువుకునే విద్యార్థులకు ప్రతి ఏటా రూ.20వేలు
* పిల్లలను బడికి పంపిన ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు
* అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్‌తో మాట్లాడి తెలంగాణలో 32కులాలను బీసీ జాబితాలో చేర్చేలా కృషి చేస్తా
* చిన్న వ్యాపారులకు ఐడీ కార్డులు
* ఎప్పుడు అవసరం అయితే అప్పుడు చిన్న వ్యాపారులకు రూ.10వేలు
* నామినేటేడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లు
* ప్రభుత్వ రంగాలకు సంబంధించిన కాంట్రాక్టుల్లో 50శాతం పనులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వచ్చేలా చట్టం
* నామినేషన్ కింద ఇచ్చే పనుల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం పనులు
* నామినేటేడ్ పదవుల్లో రిజర్వేషన్లకు నూతన చట్టం
* ఆలయాల్లో పని చేసే నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం
* షాపు ఉన్న ప్రతీ నాయి బ్రాహ్మణుడికి ఉచితంగా ఏడాదికి రూ.10వేలు
* వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10వేలు
* మత్స్యకారులకు ఏడాదికి రూ.10వేలు ఆర్థిక సాయం
* వేటకు వెళ్లిన మత్స్యకారుడు చనిపోతే ఆ ఇంటికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా
* ఇంట్లోనే మగ్గం ఉంటే ప్రతి మహిళకు పెట్టుబడి కింద ప్రతి నెల రూ.2వేలు
* సహకార డెయిరీకి పాలు పోస్తే ప్రతీ లీటర్‌కు రూ.4 ఇస్తాం
* గొర్రెలు, బర్రెలు చనిపోతే యాదవులకు రూ.6వేలు
* ఆలయ బోర్డు మెంబర్లుగా యాదవులు, నాయిబ్రాహ్మణులను  పెడతాం
* ఈ హామీలన్నీ అమలు చేస్తేనే 2024లో ఓట్లు అడుగుతా
* ఎంబీసీలు, కులం సర్టిఫికెట్లు, గ్రూప్‌ల మార్పిడి వంటి సమస్యలను బీసీ కమిషన్ పరిష్కరిస్తుంది
* సంచార జాతులకు ఉచితంగా ఇల్లు, ఉపాధి కల్పన
* సంచార జాతుల పిల్లల కోసం ప్రత్యేక గురుకుల స్కూల్స్
* పేదలు మరణిస్తే వైఎస్ఆర్ బీమా కింద రూ.7లక్షలు
* ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చే ఒక పదవి బీసీ వ్యక్తి జంగా కృష్ణమూర్తికి ఇస్తామని హామీ

Ys Jagan
Ysrcp
sops
bc community
promise
elruru bc garjana
bc commission
bc development
bc funds

మరిన్ని వార్తలు