క్యాంప్ ఆఫీస్ పై జగన్ ముద్ర : సీఎం కొడుకుగా బయటకు వచ్చాడు.. సీఎంగా అడుగుపెట్టాడు

Submitted on 25 May 2019
 YS Jagan Meets Governor Narasimhan And KCR LIVE

హైదరాబాద్ లోని తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్. ప్లేస్ అదే అయినా.. బిల్డింగ్ వేరు. అప్పట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉంటే.. ఇప్పుడు ప్రగతి భవన్ గా ఉంది. వైఎస్ మరణం తర్వాత.. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య వైఎస్ కుమారుడిగా బేగంపేట క్యాంప్ ఆఫీస్ నుంచి బయటకు కాలు పెట్టాడు జగన్. ఆ తర్వాత పార్టీ పెట్టటం... ఐదేళ్లు ప్రతిపక్షం.. విభజన తర్వాత ఏపీకి కాబోయే రెండో సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు జగన్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సింది గవర్నర్ ను కలిసి వైఎస్ఆర్ ఎల్పీ ఏకగ్రీవ తీర్మానం, ఎమ్మెల్యేల జాబితాను సమర్పించారు జగన్.

ఆ తర్వాత.. 30వ తేదీన ప్రమాణ స్వీకారానికి రావాల్సింది తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారాయన. అప్పట్లో సీఎం కొడుకుగా బయటకు వచ్చిన ఇంటికే కాబోయే సీఎంగా అడుగుపెట్టటం చర్చనీయాంశం అయ్యింది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా ప్రగతిభవన్ లో కలిశారు జగన్. ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. ఏపీలో ప్రజా తీర్పు, మెజార్టీలు, ఇతర రాజకీయ అంశాలు కూడా కొద్దిగా చర్చకు వచ్చాయి. అన్నింటి కంటే క్యాంప్ ఆఫీస్ లో జగన్ ఔట్ - ఇన్ అంశం అందరూ ఆసక్తిగా చర్చించుకోవటం జరిగింది. ఎంతలో ఎంత మార్పు.. అప్పటి జగన్ - ఇప్పటి జగన్.. కసితో పోరాడితే రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించాడు అంటూ అభిమానులు అంటున్నారు. ఏ ఇంటి నుంచి అయితే సీఎం కొడుకుగా బయటకు వచ్చాడో.. అదే ఇంట్లోకి (అప్పట్లో క్యాంప్ ఆఫీస్ - ఇప్పుడు ప్రగతిభవన్) సీఎం హోదాలో వెళ్లటం అంటే విశేషమే కదా..
 

Ys Jagan
meets
Governor
Narasimhan
kcr live
Pragati Bhavan
Camp Office

మరిన్ని వార్తలు