మొదటి అడుగు : వైసీపీ ఎల్పీ మీటింగ్..గవర్నర్‌ను కలువనున్న జగన్

Submitted on 24 May 2019
YS Jagan meet Governor Tomorrow

ఏపి ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీతో గెలిచిన వైసీపి ప్ర‌భుత్వ ఏర్పాటు దిశ‌గా అడుగులు వేస్తుంది. ప్ర‌భుత్వ ఏర్పాటుకు చేయాల్సిన కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నారు. ఇందులో భాగంగా మే 25వ తేదీ శనివారం పార్టీ శాసనస‌భా ప‌క్ష పార్టీ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. అమ‌రావ‌తిలోని తాడేప‌ల్లి జ‌గ‌న్ క్యాంపు కార్యాల‌యంలో స‌మావేశం జ‌ర‌గ‌నుంది.. మ‌రో వైపు అధికారులు, పార్టీ నేత‌లు జ‌గ‌న్ నివాసానికి క్యూక‌ట్టారు...

అత్య‌ధిక మెజారిటీతో గెలిచిన వైసీపి అధినేత ఇంటికి సంద‌ర్శ‌కుల తాకిడి పెరుగుతోంది. మే 24వ తేదీ శుక్రవారం ప్ర‌భుత్వంలోని ఉన్న‌తాధికారులంతా జ‌గన్ నివాసానికి క్యూ క‌ట్టారు. డిపార్మెంట్‌ల వారిగా జ‌గ‌న్‌ని క‌లిసి అభినంద‌నలు తెలియ‌జేశారు అధికారులు. శాఖ‌ల వారిగా జ‌గ‌న్‌ని ప‌రిచ‌యం చేసుకుని శాఖ‌ల‌పై చిన్న పాటి స‌మీక్ష‌లు నిర్వ‌హించారు. ఇక రాష్ట్రంలోని ప్ర‌ధాన దేవాల‌యాలైన టిటిడి, దుర్గ‌గుడి, శ్రీశైలం వంటి దేవాల‌యాల నుండి పురోహితులు వేద ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఇక మ‌ధ్యాహ్నం మెత్తం పార్టీ నేత‌లు జ‌గ‌న్‌ని క‌లిశారు.

ఇదిలా ఉంటే ఏపిలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కావాల్సిన అన్ని కార్య‌క్ర‌మాల‌ను వేగంగా చేస్తోంది వైసీపి. ఇందుకోసం మెద‌టి కార్య‌క్ర‌మంలో భాగంగా పార్టీ శాశ‌నస‌భాప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఈ స‌మావేశం జ‌రుగ‌నుంది. ఈ స‌మావేశంలో జ‌గ‌న్‌ను శాసన‌స‌భాప‌క్ష నేత‌గా పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. త‌రువాత 11.30 గంట‌ల‌కు పార్టీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌రుగ‌నుంది. ఈ స‌మావేశంలో పార్ల‌మెంట‌రీ ప‌క్ష నేత‌ను ఎంపిక చేయ‌నున్నారు జ‌గ‌న్.

సమావేశాల అనంత‌రం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు జ‌గ‌న్ వెళుతారు. సాయంత్రం 4 గంట‌ల‌కు రాజ్ భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను క‌ల‌సి శాసన‌స‌భాప‌క్ష స‌మావేశం తీర్మానం అదించ‌నున్నారు..ఇలా మెత్తానికి ప్ర‌భుత్వ ఏర్పాటులో మెద‌టి అడుగు వెయ్య‌బోతున్నారు జ‌గ‌న్...ఈ నెల 30 తేదీన ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు నిర్ణ‌యించిన జ‌గ‌న్..విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాందీ స్టేడియం లేదా సిద్దార్ద మెడిక‌ల్ కాలేజీ గ్రౌండ్స్‌ను ప‌రిశీలిస్తున్నారు. 

Ys Jagan
Governor
tomorrow
governor narasimhan
Jagan Chief Minister

మరిన్ని వార్తలు