ఇదేనా మీ పాస్‌వ‌ర్డ్‌.. గంటలో కనిపెట్టేస్తారు!

Submitted on 21 February 2019
Your password may disclose, if you Using 8 Char Passwords, Can be guessed In Just hours

మీ మొబైల్, కంప్యూటర్, వెబ్ సైట్ ల పాస్ వర్డ్ లు భద్రంగా ఉన్నాయా? తస్మాత్ జాగ్రత్త.. మీకు తెలియకుండానే మీ లాగిన్ వివరాలు తెలుసుకోవచ్చుట. స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ లాక్ నుంచి ప్రతి అకౌంట్ కు లాగిన్ పాస్ వర్డ్ లు పెడుతుంటారు. ఒక్కొక్కదానికి ఒక్కో పాస్ వర్డ్ పెడితే గుర్తుపెట్టుకోవడం కష్టమనుకుంటారు. అన్నింటికీ ఒకే పాస్ వర్డ్ పెడుతుంటారు. కొందరైతే ఏముందిలే అంటూ 123456 పాస్ వర్డ్ పెడుతుంటారు. మీ అకౌంట్ భద్రత మీచేతుల్లోనే అనే విషయం మరిచిపోతున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న విలువైన సమాచారంతోపాటు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నుంచి కంప్యూటర్, బ్యాంకు అకౌంట్ క్రెడిన్షియల్స్ అత్యంత గోప్యంగా ఉంచుకోవాలి. లేదంటే మీ పాస్ వర్డ్ మరొకరికి తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకూ మీరు వాడే మొబైల్, సిస్టమ్ పాస్ వర్డ్ లు ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో ఓసారి చెక్ చేసుకోండి. 

మీ పాస్ వర్డ్ లకు 8 క్యారెక్టర్లు ఉన్నాయా? అయితే మీ పాస్ వర్డ్ కు భద్రత లేనట్టే.. ఇక నుంచి 8 క్యారెక్టర్ పాస్ వర్డ్ లు క్రియేట్ చేసుకోవడం ఆపేయండి. లేదంటే.. గంటల్లో మీరు పెట్టిన పాస్ వర్డ్ గంటల వ్యవధిలో గెస్ చేయొచ్చు అంటున్నారు రీసెర్చర్లు. 8 క్యారెక్టర్ పాస్ వర్డ్ లు వాడుతున్నవారి లాగిన్ వివరాలను 2.5 గంటల్లో గుర్తించారట. ఎవరైనా పాస్ వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు సాధారణంగా అప్పర్ కేస్, లోయర్ కేస్, న్యూమరిక్, స్పెషల్ క్యారెక్టర్లు వాడుతుంటారు. అయినప్పటికీ 8 క్యారెక్టర్ పాస్ వర్డ్ లు అంత సురక్షితం కాదని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి రీసెర్చ్ లో 8 క్యారెక్టర్ పాస్ వర్డ్ లను సులభంగా గుర్తించినట్టు తెలిపారు.

‘హ్యాష్ క్యాట్ (HashCat)’6.0.0 బీటా అనే పాస్ వర్డ్ రికవరీ టూల్ తో మీ పాస్ వర్డ్ ఏంటో గంటల్లో చెప్పవచ్చు అంటున్నారు. విండోస్ NTLM పాస్ వర్డ్ ను 2.5 గంటల్లో గుర్తించినట్టు చెప్పారు. సైబర్ సెక్యూరిటీ నిపుణులు ప్రాజెక్ట్ లో భాగంగా కాంప్లెక్స్ పాస్ వర్డ్ ను ఎలా ట్రేస్ అవుతుందనే విధానాన్ని చూపించారు. హ్యాష్ క్యాట్ బీటా వర్షన్ టూల్ ద్వారా పాస్ వర్డ్ ను ట్రాక్ చేసినట్టు తెలిపారు. 8 క్యారెక్టర్ పాస్ వర్డ్ లకు కాలం చెల్లిందని రీసెర్చర్లు అభిప్రాయపడుతున్నారు. 

20 క్యారెక్టర్ ఉండాల్సిందే
సాధారణంగా ఇంటర్నెట్ గైడ్ లైన్స్ ప్రకారం.. కొన్ని వెబ్ సైట్లు గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు తమ వెబ్ సైట్లలో లాగిన్ అయ్యే యూజర్లకు కనీసం 8 క్యారెక్టర్ పాస్ వర్డ్ తప్పనిసరిగా ఉండాలి. సోషల్ మీడియా నెట్ వర్క్ దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ లాగిన్ పాస్ వర్డ్ లు.. ర్యాండమ్ గా 6 క్యారెక్టర్ మాత్రమే ఉంటున్నాయి. సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఐదు ర్యాండమ్ వర్డ్స్ (ఒక్కొక్కటి.. 4 నుంచి 5 క్యారెక్టర్లు) ఉండేలా చూసుకోమంటున్నారు. అంటే.. మొత్తం 20 క్యారెక్టర్ (స్పెషల్ క్యారెక్టర్లు, న్యూమరిక్, అప్పర్ కేస్, లోయర్ కేస్) పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.  


మరిన్ని వార్తలు