నాలుగేళ్ళయినా ఊపు తగ్గలా..

Submitted on 13 February 2019
Young Tiger's High-voltage Blockbuster Temper completes 4 years-10TV

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో రూపొందిన హై-ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. టెంపర్.. 2015 ఫిబ్రవరి 13 న రిలీజ్ అయిన టెంపర్.. 13-02-19 నాటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నటుడిగా ఎన్టీఆర్‌నీ, డైరెక్టర్‌గా పూరీని మరో మెట్టు ఎక్కించిన సినిమా ఇది.. హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్, పోసాని కృష్ణమురళి, మధురిమ, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి తదితరులు నటించగా, గణేష్ బాబు నిర్మించాడు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన పాటలు, మణిశర్మ ఇచ్చిన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అనే చెప్పాలి..

వరస ఫ్లాప్స్‌లో ఉన్న తారక్‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది టెంపర్.. దయ గాడి దండ యాత్ర అంటూ, బాక్సాఫీస్‌పై దాడి చేసి, కలెక్షన్‌లు కొల్లగొట్టాడు ఎన్టీఆర్.. వక్కంతం వంశీ కథ అందించాడు.. రిలీజ్ తర్వాత టెంపర్ స్టోరీని బుక్ రూపంలో తీసుకొచ్చారు. ఈ మధ్యే, హిందీలో సింబాగా రీమేక్ చేస్తే, సూపర్ హిట్ అయ్యింది.. త్వరలో తమిళ్‌లో అయోగ్య పేరుతో రిలీజ్ కానుంది.. 

వాచ్.. నీ తాత టెంపర్ వీడియో సాంగ్...

Jr.Ntr
Kajal Agarwal
Anup Rubens
Ganesh Babu
Puri Jagannath

మరిన్ని వార్తలు