కమింగ్ సూన్ : మీ వాట్సాప్ Chat విండోస్‌లో Ads డిస్‌ప్లే

Submitted on 25 May 2019
You Will Start Seeing Ads Inside WhatsApp Chat Windows Very Soon

సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్, ట్విట్టర్ లో యాడ్స్ డిస్ ప్లే కావడం చూశాం. ఇన్ స్టాగ్రామ్ లో కూడా యాడ్స్ చూసే ఉంటాం. ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసిన యాప్స్ లో యాడ్స్ డిస్ ప్లే అవుతుంటాయి. అతి త్వరలో వాట్సాప్ మెసేంజర్ యాప్ లో కూడా Ads డిస్ ప్లే కానున్నాయి. వాట్సాప్ ప్లాట్ ఫాంపై యాడ్స్ సర్వ్ చేయడం ఎంతవరకు సాధ్యం అనేదానిపై ఫేస్ బుక్ సీఈఓ జూకర్ బర్గ్ సహా ఇతర వ్యవస్థాపకులు చర్చలు జరిపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి.

2020 నుంచి యాడ్స్ సర్వింగ్ :
కానీ, ఆ చర్చల ఒప్పందం కుదరకపోవడంతో సదరు కంపెనీ వెనక్కి తగ్గింది. ఇప్పుడు.. వాట్సాప్ లో యాడ్స్ సర్వ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. 2020 నుంచి యూజర్లు.. తమ ఫేవరెట్ వాట్సాప్ మెసేంజర్ పై పెస్కీ యాడ్స్ క్లౌడింగ్ చూడవచ్చు. ఈ వారంలో నెదర్లాండ్స్ లో జరిగిన ఫేస్ బుక్ వార్షిక మార్కెటింగ్ సదస్సులో కంపెనీ ఎగ్జిక్యూటీవ్ లు వాట్సాప్ లో యాడ్స్ స్టార్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. 2020 నుంచి వాట్సాప్ మెసేంజర్ చాట్ విండోస్ లో యాడ్స్ కనిపిస్తాయని తెలిపారు. 

ఈ యాడ్స్.. ఫొటోగ్రాఫ్ స్లైడ్లతో కూడిన యాడ్స్ డిసిప్లే కానున్నాయి. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో వాట్సాప్ స్టేటస్ పై కూడా యాడ్స్ కనిపించనున్నాయి. ఆ యాడ్ ఇమేజ్ పై క్లిక్ చేయగానే వాట్సాప్ ఎంటైర్ స్ర్కీన్ పై డిస్ ప్లే అవుతుంది. షేర్ టెక్స్ట్ , ఫొటోలు, వీడియోలు, యానిమేటెడ్ GIF ఇమేజ్ లను కంపెనీలు షేర్ చేసేందుకు యాడ్స్ ద్వారా అనుమతి ఉంటుంది. కానీ, ఈ యాడ్స్ 24 గంటల తర్వాత అదృశ్యమైపోతాయి.

స్టేటస్ అప్ లోడ్ చేసే ముందు కాంటాక్ట్ నేమ్ కు బదులుగా స్టేటస్ అప్ డేట్ కానుంది. ఇదొక్కటే మాత్రమే తేడా. యాడ్ ఇచ్చిన కంపెనీ పేరును కూడా యూజర్లు చూడొచ్చు. వాట్సాప్ చాట్ విండోస్ పై డిస్ ప్లే యాడ్స్ ను అవైడ్ చేసే అవకాశం కూడా ఉంది. యాడ్స్ పై కచ్చితంగా క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. 

ఆటోమాటిక్ గా యాడ్స్ ఓపెన్ కావు. ఏళ్ల తరబడి వాట్సాప్ వాడుతున్న యూజర్లకు సడన్ గా యాడ్స్ డిస్ ప్లే కావడం ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. వాట్సాప్ యాడ్ ఫీచర్ పై ఓ సోషల్ మీడియా ఇండస్ట్రీ కామెంటేటర్ ట్వీట్ చేశారు.

‘ 2020 లో వాట్సాప్ స్టేటస్ (స్టోరీస్) ఫీచర్ త్వరలో రానుంది. బిజినెస్ యాప్ లో రిచర్ మెసేజింగ్ ఫార్మాట్ ఆప్షన్ ప్రవేశపెట్టనున్నారు. ఫేస్ బుక్ బిజినెస్ మేనేజర్ క్యాట్ లాగ్ తో వాట్సాప్ ప్రొడక్ట్ క్యాట్ లాగ్ ను ఇంటిగ్రేటడ్ చేయనున్నారు’ అని ట్వీట్ లో తెలిపారు. 

WhatsApp Chat Box
Ads
Whatsapp Ads
Pesky Ads clouding
facebooks 10 year challenge

మరిన్ని వార్తలు