సీఎం జగన్‌ పై వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

Submitted on 24 January 2020
YCP MLA Jonnalagadda Padmavati Interesting comments on CM Jagan in ap Assembly

వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్‌ మీడియంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ఏదైనా అనుకుంటే దానిని చేసి తీరతారంటూ ఓ సినిమాలోని డైలాగ్‌ను కోట్‌ చేశారు. నువ్వు అనుకుంటే అవ్వుది స్వామి.. నీ నవ్వు వరం అన్నారు. నీ కోపం శాపం.. నీ మాట శాసనం అని పద్మావతి తెలిపారు. 

శాసనమండలిలో ఏమి రిజక్టు చేసినా గానీ జగన్ అన్న అనుకుంటే అవుతుందన్నారు. జగన్ అనుకుంటే ఏదైనా తప్పకుండా అవుతుందని చెప్పారు. ఎడ్యుకేషన్ బిల్లు, ఇంగ్లీష్ మీడియం బిల్లును స్వాగతించారు. అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. 


 

YCP
MLA Jonnalagadda Padmavati
Interesting comments
cm jagan
AP Assembly
Amaravathi

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు