యాత్ర 2 వస్తుందా?

Submitted on 24 May 2019
Yatra Sequel or Coming?

వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ఆధారంగా, మహి వి.రాఘవ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా.. యాత్ర.. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు యాత్రకి సీక్వెల్ రానుందని తెలుస్తుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి, జగన్ సీఎమ్‌గా ఎంపికైన నేపథ్యంలో, యాత్ర దర్శకుడు మహి వి.రాఘవ్ జగన్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తూ ట్వీట్ చేసాడు.

'కంగ్రాట్స్ జగన్ అన్నా, ఈ విజయానికి నువ్వు అర్హుడివే.. నువ్వు హామీ ఇచ్చినట్టు వైఎస్సాఆర్ జనం కోసం చేసిన కృషి కంటే ఎక్కువ కష్టపడతావని ఆశిస్తున్నాం, ప్రజలకు చెప్పి తీరాల్సిన విజయం నీది'.. అంటూ జగన్‌తో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ, #యాత్ర హ్యాష్ ట్యాగ్ యాడ్ చేసాడు. దీంతో యాత్రకి సీక్వెల్‌గా యాత్ర 2 రానుందని హింట్ ఇచ్చాడని అర్థమవుతుంది.

Congratulations to @ysjagan @YSRCParty Anna a truly deserving victory. As promised Hope you deliver more than Y S Rajasekhar Reddy Garu. You have a written and made story worth telling.. :)  #yatra2 @ShivaMeka pic.twitter.com/1BI6ArOMFh
— Mahi Vraghav (@MahiVraghav) May 23, 2019

Yatra
Y.S.Jagan
Mahi V Raghav

మరిన్ని వార్తలు