పల్లెళ్ళో కళ ఉంది-వీడియో సాంగ్

Submitted on 11 February 2019
Yatra Movie Pallello Kala Undhi Video Song-10TV

వై.ఎస్.రాజశేఖర రెడ్డి జీవితంలో అత్యంత కీలకమైన పాదయాత్ర సంఘటన ఆధారంగా రూపొందిన యాత్ర, ఫిబ్రవరి 8న రిలీజ్ అయ్యింది. ప్రజల కష్టాలను, వాటి పరిష్కారాలను రాజశేఖర రెడ్డి అమలు పరచిన విధానాన్ని మనసుకి హత్తుకునేలా చూపించడంతో ప్రేక్షకులు యాత్రకి బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా మౌత్‌టాక్‌తో, మంచి కలెక్షన్స్‌తో రన్ అవుతుంది.యాత్ర నుండి, పల్లెళ్ళో కళ ఉంది వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటని అద్భుతంగా రాయగా, గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలు అంతే అద్భుతంగా పాడారు.

పల్లెళ్ళో కళ ఉంది, పంటల్లో కలిముంది, అనిచెప్పే మాటల్లో విలువేముంది? కళ్లల్లో నీరుంది, ఒళ్ళంతా చెమటుంది, ఆ చెమ్మకి చిగురించే పొలమేముంది? చినుకివ్వని మబ్బుంది, మొలకివ్వని మన్నుంది, కరుణించని కరువుంది, ఇంకేముందీ? రైతేగా రాజంటూ అనగానే ఏమైంది, అది ఏదో నిందల్లే వినబడుతుంది.. అంటూ సాగే పాట వినడానికి హార్ట్ టచింగ్‌గా అనిపిస్తుంది. విజువల్‌గా చూస్తే కళ్ళు చెమరుస్తాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆవేదన, కష్టం.. ఈ పాటలో కనిపిస్తుంది.. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, వై.ఎస్.ఆర్. పాత్రలో జీవించాడు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి ఈ పాటలో..

వాచ్ వీడియో సాంగ్...

Yatra
Mammootty
YSR Biopic
Mahi V Raghav
70MM Entertainments

మరిన్ని వార్తలు