పండుగలను క్యాష్ చేసుకున్నారు : జస్ట్ 7 రోజుల్లో 53లక్షల ఫోన్లు, టీవీల అమ్మకాలు

Submitted on 8 October 2019
Xiaomi sold 5.3 million devices during Diwali With Mi sale

చైనా కంపెనీ జియోమీ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకుంది. జియోమీ ఉత్పత్తులు భారీగా అమ్ముడుపోయాయి. జస్ట్ 7 రోజుల్లో 53 లక్షల అమ్మకాలు జరిగాయి. ఇందులో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు సేల్ అయ్యాయి. 30లక్షల స్మార్ట్ ఫోన్లు విక్రయించారు. ఆ తర్వాత ఎంఐ టీవీలు, ఐవోటీ ఉత్పత్తులు ఉన్నాయి. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని జియోమీ ప్రత్యేక ఆఫర్లు ఇచ్చింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కామ్ లో స్పెషల్ సేల్స్ పెట్టింది. దీనికి అనూహ్య స్పందన లభించింది. విపరీతంగా సేల్స్ జరిగాయి. 

ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు సేల్ అయినట్టు యాజమాన్యం తెలిపింది. ప్రతి నిమిషానికి 525 డివైజ్ లు సేల్ అయినట్టు తెలిపారు. 50లక్షల డివైజ్ లు అమ్ముడుపోతే.. అందులో 38లక్షలు స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి సేల్స్ లో 50శాతం గ్రోత్ ఉందని కంపెనీ వర్గాలు చెప్పాయి. 2.5 లక్షల ఎంఐ టీవీలు అమ్ముడుపోయాయని తెలిపింది.

ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రో 32, ఎంఐ టీవీ 4సీ 32 ఇంచ్ మోడల్, ఎంఐ ఎల్ఈడీ టీవీ ఎక్స్ ప్రో 55 ఇంచ్ మోడల్ ఎక్కువగా సేల్ అయినట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. బాగా పాపులర్ అయిన రెడ్ మీ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు ఇచ్చారు. దీంతో స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. భారీగా సేల్స్ జరగడంతో జియోమీ కంపెనీ వర్గాలు ఫుల్ ఖుషీగా ఉన్నాయి.

XIAOMI
sold
5.3 million devices
Diwali
Mi Sale

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు