సేఫ్టీ వార్నింగ్ : షియోమీ Mi ఎలక్ట్రానిక్ స్కూటర్ (M365) రీకాల్ 

Submitted on 12 September 2019
Xiaomi recalling Mi Electric Scooter (M365) over safety issue

చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షియోమీ Mi ఎలక్ట్రానిక్ స్కూటర్ (M365) యూనిట్లను రీకాల్ చేస్తున్నట్టు ప్రకటించింది. భద్రతపరమైన లోపాల కారణంగా 10వేల ఎంఐ ఎలక్ట్రానిక్ స్కూటర్లను రీకాల్ చేస్తోంది. ఎంఐ ఎలక్ట్రానిక్ స్కూటర్ల యూనిట్లలో ప్రధానంగా మెయిన్ బాడీలో సేప్టీ ఇష్యూలు తలెత్తినట్టు గుర్తించింది. మెయిన్ బాడీలోని వర్టికల్ కంపోనెంట్ స్ర్కూ (మర) పోల్డ్ అయి లూజ్ అవుతున్నట్టు గుర్తించారు. 

యూకేలో సేల్ అయిన ఎంఐ M365 స్కూటర్లలో 7వేల 800 మోడల్స్ స్ర్కూ లూజ్ లోపం తలెత్తాయి. దీంతో స్కూటర్ వినియోగాన్ని నిలిపివేయాల్సిందిగా వినియోగదారులకు షియోమీ రీకాల్ నోటీసులు పంపినట్టు అధికారిక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 27, 2018, డిసెంబర్ 5, 2018 మధ్యకాలంలో మ్యానిఫ్యాక్చర్ అయిన ఎలక్ట్రానిక్ స్కూటర్లు మొత్తం 10వేల 257 యూనిట్లలో లోపం తలెత్తింది. 

అందులో యూకేలోనే 7వేల 406 యూనిట్లలో సమస్య ఉన్నట్టు గుర్తించింది. స్ర్కూ లూజ్ సమస్య ఉన్న ఎలక్ట్రానిక్ స్కూటర్ల యూనిట్లను వెంటనే రీకాల్ చేయించుకోవాల్సిందిగా సూచించింది. ఎంఐ ఎలక్ట్రానిక్ స్కూటర్ (M365) మోడల్ యూనిట్లు కొనుగోలు చేసిన కస్టమర్లు తమ స్కూటర్లలో ఈ సమస్య తలెత్తిందో లేదో చెక్ చేసుకోవాలని సూచించింది. కొనుగోలు చేసిన కస్టమర్లకు సేఫ్టీ వార్నింగ్ రీకాల్ నోటీసులు పంపి అలర్ట్ చేస్తోంది. 

ఎంఐ ఈ-స్కూటర్ల సీరియల్ (S/N) నెంబర్లలో 21074/00000316 - 21074/00015107, 16133/00541209 - 16133/00544518 ఎక్కువగా Screw loose ఇష్యూ ఉన్నట్టు గుర్తించారు. ఎంఐ ఎలక్ట్రాక్ స్కూటర్ (M365) మోడల్ రీకాల్ ప్రొగ్రామ్ జూన్ 26, 2019 నుంచి ముందుగా యూకేలో ప్రారంభమైంది. జూలై 1, 2019 నుంచి ఇతర దేశాల మార్కెట్లలో రీకాల్ ప్రొగ్రామ్ కొనసాగుతోంది. స్ర్కూ సమస్య తలెత్తిన స్కూటర్లను వినియోగించడం వెంటనే ఆపేయాలని కస్టమర్లకు విజ్ఞిప్తి చేస్తోంది. 

గమనిక : స్ర్కూ లూజ్ ఇష్యూ ఉన్న స్కూటర్లను వాడొద్దు. సొంతంగా ఫిక్స్ చేసేందుకు కస్టమర్లు దయచేసి ప్రయత్నించొద్దు. కస్టమర్లందరూ ఎంఐ స్కూటర్లు ఆపరేటింగ్ చేసే ముందు తప్పకుండా సూచనలను జాగ్రత్తగా చదవండి. ఏ స్కూటర్ అయినా ముందుగానే సమస్యను సవరించి ఉన్నట్టుయితే అలాంటి యూనిట్లను రీకాల్ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మీరు వాడే ఎంఐ స్కూటర్ లో స్ర్కూ సమస్య ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి. షియోమీ పూర్తి వివరాల కోసం మీరు ఉండే లొకేషన్ అనుసరించి సంబంధిత సర్వీసు సెంటర్ ను సంప్రదించవచ్చు. 

ఎఫెక్టెడ్ యూనిట్లు రీజియన్ల వారీగా :
జర్మనీ (613 యూనిట్లు), స్పెయిన్ (509 యూనిట్లు), ఐర్లాండ్ (443 యూనిట్లు), డెన్మార్క్ (258 యూనిట్లు), కజకిస్థాన్ (200 యూనిట్లు), మయన్మార్ (175 యూనిట్లు), కొలంబియా (97 యూనిట్లు), టర్కీ (80 యూనిట్లు), లాయోస్ (79 యూనిట్లు), ఇటలీ (37యూనిట్లు), హంగారీ (34 యూనిట్లు), గ్రీస్ (31 యూనిట్లు), కొరియా (30 యూనిట్లు), మకయూ (25 యూనిట్లు), యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (22 యూనిట్లు), బెల్జియం (17 యూనిట్లు), పోర్చుగల్ (16 యూనిట్లు), సింగపూర్ (14 యూనిట్లు), రష్యా (1 యూనిట్లు) , థాయిలాండ్ (1 యూనిట్లు), ఇతర రీజియన్లలో (169 యూనిట్లు).

Mi ఈ-స్కూటర్ (M365) రీకాల్ ప్రాసెస్ ఇలా :
*  ఈ-స్కూటర్ కింది భాగంలో బార్ కోడ్ Serial No (21074/00000316) మాదిరిగా ఉంటుంది. 
* మీ స్కూటర్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. 
* వెరిఫికేషన్ కోడ్ (captcha) ఎంటర్ చేసి వెరిఫై బటన్ పై క్లిక్ చేయాలి. 
* మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయమంటూ ఒక Prompt విండో వస్తుంది. 
* 72 గంటల్లో రీకాల్ ప్రాసెస్ అదనపు సమాచారం మెయిల్ ఐడీకి వస్తుంది. 
* స్కూటర్ ఇష్యూ ఫిక్స్ చేస్తే ఎలాంటి ఛార్జ్ ఉండదు. 

XIAOMI
RECALL
Mi Electric Scooter
safety issue

మరిన్ని వార్తలు