
ప్రముఖ మొబైల్ తయారీదారు సంస్థ జియోమీ ప్రకటించిన రెడ్ మీ 6 సిరీస్ ధరలు తాత్కాలికంగా తగ్గిపోయాయి. మొబైల్ యూజర్లను ఆకర్షించేందుకు జియోమీ కంపెనీ ఎప్పుడూ లేనంతగా.. రెడ్ మీ 6ఏ, రెడ్ మీ 6 ప్రో, రెడ్ మీ 6 సిరీస్ ఫోన్లపై తాత్కాలిక డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. రూ. 500 నుంచి రూ.2,500 వరకు డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 8 వరకు మూడు రోజుల పాటు ఈ తాత్కాలిక డిస్కౌంట్లు వర్తిస్తాయి. ఇటీవల ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ శాంసంగ్.. యూజర్లను ఆకర్షించేందుకు శాంసంగ్ గెలాక్సీ M10, M20 డివైజ్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. శాంసంగ్ కు పోటీగా జియోమీ తమవైపు యూజర్లను ఎట్రాక్ట్ చేసేందుకు రెడ్ మి 6 సిరీస్ లపై తాత్కాలిక డిస్కౌంట్లతో ముందుకొచ్చింది. ఈ మేరకు జియోమీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ప్రకటన జారీ చేసింది.
గెలాక్సీ M సిరీస్ పై పోటీని తట్టుకొనేందుకు తాత్కాలిక ధర తగ్గింపుతో డిస్కౌంట్లు ప్రవేశపెట్టినట్టు తెలిపింది. ‘‘రియల్ డీల్ కు ఇదే సరైన సమయం. M సిరీస్ వినియోగం ఎంతో స్మార్ట్ గా ఉంటుంది. ఆలోచించి ఎన్నుకోండి’’ అంటూ ట్వీట్ చేసింది. రెడ్ మీ అందించే రెడ్ మీ 6 సిరీస్ ఫోన్లపై తాత్కాలిక తగ్గింపు ధరలతో ఈ కామర్స్ వెబ్ సైట్లు mi.com, Amazon India and Flipkart లో అందుబాటులో ఉన్నాయి. రెడ్ మీ 7 సిరీస్ డివైజ్ లను స్మార్ట్ మార్కెట్లలోకి విడుదల చేయడానికి కొన్ని వారాల ముందే తాత్కాలిక డిస్కౌంట్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది జియోమీ.
Time for some Real deals! As a 'M'illennial be smart and choose wisely! pic.twitter.com/jWc3bnTxrz
— Redmi India (@RedmiIndia) February 5, 2019
3 రోజులే.. తాత్కాలిక డిస్కౌంట్లు ఇవే..
* రెడ్ మీ 6A సిరీస్ : 2జీబీ RAM, 32జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 6వేల 499 మాత్రమే. అసలు ధర రూ.7వేల 999. తాత్కాలిక తగ్గింపు ధర రూ.1 వెయ్యి 500 వరకు తగ్గింది.
* రెడ్ మీ 6 : 3జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ ఫోన్ ధర ప్రస్తుతం రూ.8వేల 499 మాత్రమే. అసలు ధర రూ.10వేల 499. అంటే రూ. 2వేల వరకు తగ్గిందినమాట.
* రెడ్ మీ 6 ప్రో (ఫస్ట్ వేరియంట్) : 3జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నెల్ స్టోరేజీ ఫోన్ ధర రూ.8వేల 499 మాత్రమే. అసలు ధర రూ.9వేల 999 ఉండగా.. రూ.1వెయ్యి 500 వరకు తగ్గింది.
* రెడ్ మీ 6 ప్రో (సెకండ్ వేరియంట్) : 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ ఫోన్ రూ.10వేల 999 మాత్రమే. అసలు మార్కెట్ ధర రూ. 13,499 ఉండగా.. రూ.2వేల 500 వరకు తగ్గింది.