ఇండియాలో 1% ధనవంతుల సొమ్ము 70% పేదల జీవితాలతో సమానం

Submitted on 20 January 2020
ఇండియాలో 1% ధనవంతుల సొమ్ము 70% పేదల జీవితాలతో సమానం

పన్నులు కట్టండి పేదవాళ్లని బాగుచేస్తాం అని చెప్తోన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో మరి.. దేశంలో ఉన్న ధనికులు ఒక్క శాతం(953మిలియన్ మంది)వద్ద ఉన్న డబ్బు.. 70శాతం మంది పేద ప్రజల డబ్బుకు సమానమట. భారత్‌లో ఉన్న బిలీయనర్ల సంవత్సర బడ్జెట్ ఆధారంగా చేసిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. టైమ్ టు కేర్.. చేసిన రీసెర్చ్‌లో భాగంగా వివరాలిలా ఉన్నాయి. 

వరల్డ్ ఎకానమిక్ ఫారం(డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో ప్రపంచంలోని 4.6 బిలియన్ మంది దగ్గరున్న సొమ్ము కంటే 2వేల 153బిలియనీర్ మంది ధనికులు ఉన్నారు. గడిచిన దశాబ్దంలో బిలీయనర్లు రెట్టింపు అయ్యారు. 

'విచ్చిన్నమైన ఆర్థిక సొమ్మంతా బిలీయనర్ల జేబుల్లోకి వెళ్తుంది. ప్రపంచంలో జరుగుతున్న వ్యాపారమంతా మధ్య తరగతి మహిళలు, పురుషుల నుంచే' అని ఆక్సాఫామ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ బెహర్ వెల్లడించారు. ఇది తెలిశాక ఎవరైనా బిలియనీర్లుగా ఎవరిని ఉండనివ్వకూడదనే అంటారు' అని ఆయన అన్నారు. 

గడిచిన దశాబ్దంలో వివరాలిలా:
ప్రపంచంలోని ముగ్గురు ధనికులు గడిచిన దశాబ్దంలోనే మొత్తం 231బిలియన్ డాలర్లు సంపాదించారు. బ్లూమ్‌బెర్గ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జూకర్‌బర్క్ ప్రపంచంలోనే ఐదో ధనికవంతమైన వాడిగా నిలిచాడు. అతని ఖాతాలో 6బిలియన్ డాలర్లు ఆధాయం పెరిగింది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ 116బిలియన్ డాలర్లతో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నారు. 2012 నుంచి టాప్ 20 బిలీయనర్ల సంపాదన రెట్టింపు అంటే 672బిలియన్ డాలర్ల నుంచి 1.397వేల బిలియన్ డాలర్లకు పెరిగింది. 

వరల్డ్ బ్యాంక్ రీసెర్చ్ ప్రకారం.. అసమానతలు అనేవి పేదరికంపై భారీ ప్రభావం చూపిస్తున్నాయి. ఈ విశ్లేషణ ఆధారంగా దేశ ఆధాయంలో 1శాతం ఇన్ ఇక్వాలిటీ చూపిస్తే 100మిలియన్ మంది ప్రజలు 2030నాటికి గడ్డు పేదరికానికి చేరుకుంటారు. రెండు దశాబ్దాల్లో ఈ పేదరికం స్థాయి మరింత పడిపోయింది. 1990 నాటి నుంచి రోజుకు 1.90డాలర్ వేతనం కంటే తక్కువ వేతనంతో 1.1బిలియన్ మంది బతుకుతున్నారు. 

కొన్ని దేశాల్లో పేదరిక స్థాయి తగ్గడం నిదానించిన దానిపై వరల్డ్ బ్యాంక్ హెచ్చరించింది. 2015 నుంచి ఇప్పటికీ 736మిలియన్ మంది పేదరికంలోనే బతుకుతున్నారు. ఆఫ్రికాలో సగం కంటే ఎక్కువ మంది ఈ స్థాయి వారే. 

World
richest
wealth
Oxfam
poverty
world bank

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు