బ్రాండ్ సిటీ: హైదరాబాద్‌లో గూగుల్ వరల్డ్ బిగ్గెస్ట్ క్యాంపస్

Submitted on 21 February 2019
Worlds Biggest Google Campus In Hyderabad

హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రోజురోజుకి పెరుగుతోంది. ప్రపంచపటంలో ఐటీకి కేరాఫ్‌గా మారిన హైదరాబాద్ నగరంలో మరో అంతర్జాతీయ సంస్థ క్యాంపస్ కొలువుదీరనుంది. ప్రముఖ సెర్చింజన్ గూగుల్ తన క్యాంపస్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనుంది. గూగుల్ క్యాంపస్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే క్యాంపస్ నిర్మాణానికి గూగుల్ సిద్ధం కానుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద గూగుల్ క్యాంపస్ అమెరికాలో ఉంది. దాని తర్వాత అంత పెద్ద క్యాంపస్‌కు హైదరాబాద్ వేదిక కానుంది. ఆసియాలో ఇదే అతిపెద్ద గూగుల్ క్యాంపస్ కావటం విశేషం. 2015లో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. గూగుల్ ప్రతినిధులతో ఎంవోయూ చేసుకున్నారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో గూగుల్ క్యాంపస్‌కు తెలంగాణ ప్రభుత్వం 7.2ఎకరాల స్థలం కేటాయించింది.

ఇది వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్. 7.2ఎకరాల్లో 22 ఫ్లోర్లతో సింగిల్ బ్లాక్‌లో నిర్మించనున్నారు. త్రీ బేస్‌మెంట్స్(పార్కింగ్‌కు రెండు), గ్రౌండ్ ఫ్లోర్ ఉండనున్నాయి. 13వేల ఉద్యోగులు ఇందులో పని  చేయనున్నారు. ఇందులో 4 ఆఫీసులు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గుర్గావ్ బ్రాంచులు ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తారు. రెండున్నరేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని గూగుల్  చెప్పింది. ఇప్పటికే కొండాపూర్‌లో గూగుల్ ఆఫీస్ ఉంది. అందులో 7వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇప్పటికే టాప్ 5 గ్లోబల్ కంపెనీల ఆఫీసులు హైదరాబాద్‌లో ఉన్నాయి. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ సంస్థలు హైదరాబాద్ వేదికగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ క్యాంపస్ కూడా ఏర్పాటైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగనుంది.

* హైదరాబాద్‌లో గూగుల్ వరల్డ్ బిగ్గెస్ట్ క్యాంపస్
* అమెరికాలో తర్వాత ఇదే అతి పెద్ద క్యాంపన్
* వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్ట్
* 22 ఫ్లోర్లతో 7.2ఎకరాల్లో క్యాంపస్
* 13వేల మంది ఉద్యోగులు

google worlds biggest campus
Hyderabad
google office
environment clearance
Google Incs biggest campus
US headquarters
KTR
KCR
Telangana

మరిన్ని వార్తలు