ప్రపంచ జల దినోత్సవం: 2050 నాటికి బోడిగుండులే 

Submitted on 22 March 2019
World Water Day Warning..on By 2050, people are balding Ex President Abdul Kalam Warning

నీటితో జీవం అంకురించింది. ప్రకృతి మనుగడ  నీటితోనే కొనసాగుతోంది. జీవవైవిధ్య పరిరక్షణ..జీవం జలంతోనే సాధ్యమవుతుంది. ఇవన్నీ తెలిసినా..నీటిని వృధా చేస్తున్నాం..నీటి వనరుల్ని వ్యర్థాలతో కలుషితం చేసేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే..మనకు అందుబాటులో ఉన్న నీటిని వృధా చేస్తున్నాం. 

ఈ పరిస్థితి ఇలాగే  కొనసాగితే..2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమైన నీరు  ఉండనే ఉండదని..ప్రజలు స్నానాలు చేయడం మానేసి శరీరానికి రసాయనిక లేపనాలు రాసుకుంటారనీ..(కెమికల్ బాత్) వాటితోనే స్నానాలు చేస్తారనీ..దేశ సరిహద్దుల్లో కాపలా కాయాల్సిన  సైనికులు నీటి వనరుల చుట్టు కాపలా కాసా పరిస్థితి ఉంటుందని.. తలంటు కోవడానికి నీరు సరిపోక ప్రజలందరూ బోడి గుండుతో జీవిస్తారనీ, స్త్రీ పురుషులందరూ రోజు తల షేవ్ చేసుకునే పరిస్థితి వస్తుందని దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితిని ఎలా ఉంటుందో అంచనా వేయొచ్చు.
Read Also : కార్బైడ్‌ ఉపయోగిస్తే కఠిన చర్యలే : హైకోర్టు కీలక ఆదేశాలు

ఇటువంటి దారుణమైన దుస్థితి ప్రపంచంలోని ప్రజలకు రాకూడదనే ఉద్ధేశంలోనే ఐక్యరాజ్యసమితి  మార్చి 22 న ప్రపంచ జల దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించింది. ప్రపంచ నీటి దినోత్సవాన్ని అంతర్జాతీయంగా పాటించాలన్న ఆలోచనతో ‘పర్యావరణం, ప్రగతి’ అనే అంశంపై బ్రెజిల్‌లోని రియో డి జనీరియో వేదికగా 1992లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశంలో రూపుదిద్దుకుంది. 2019లో ‘Leaving no one behind’ నినాదాన్ని ఐరాస ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందజేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 

మొత్తం భూభాగంలో 70.9 శాతం నీటితో నిండి వుంది. అందులో 86.5 శాతం సముద్రపు నీరు (ఉప్పునీరు)  కాగా..1.7 శాతం భూగర్భ జలాలు..మరో  1.7శాతం మంచు రూపంలో ఉమిడి ఉంది. దీంతో భూమిమీద మొత్తం 2.5 శాతం మాత్రమే మంచినీరు ఉంది. అందులో 0.3 శాతం నదుల్లో, కాలువల్లో ప్రవహిస్తుంటుంది. ఈ వనరులే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 700 కోట్ల మంది (తెలిసిన..అందిన సమాచారం మేరకు)  దాహాన్ని, ఇతర అవసరాలను తీరుస్తున్నాయి. 

నీటి స్ఫూర్తినిచ్చిన నాగరికతలు 
భారత్‌లో సింధు నాగరికత, ఈజిప్టులో నైలు నది నాగరికత ఇలా ప్రపంచ నాగరికతలు నదీ తీరాలు, నీటి వనరులకు సమీప ప్రాంతంలో విలసిల్లాయి. మన చరిత్రంతా జలవనరులతోనే ముడిపడి ఉంది. నీటిని పరిరక్షించుకోవాలనే నినాదాన్ని ఈ నాగరికతలు వెల్లడించాయి.  

నీటిని పూజించే భారతీయులు 
భారతీయులకు నీటి విలువ తెలుసు కాబట్టే నీటిని గంగమ్మ అంటూ పూజించి, నదులకు, చెరువులకు, జలాశయాలకు హారతులిస్తారు. నారం అంటే నీరు. నీటిలో ఉంటాడు కాబట్టి శ్రీమహావిష్ణువుకు నారాయణుడు అని పేరు. నీటినే రూపంగా స్వీకరించి విష్ణువు నీటి విలువను చెప్తున్నాడు. శివుడు ఏకంగా గంగను తన తలపై ధరించి గంగాధరుడయ్యాడు. నీరు పారబోయాల్సింది కాదు, నెత్తిన పెట్టుకుని పూజించాలని సమస్త మానవాళికి సందేశం ఇచ్చాడు. ఆ సందేశాన్ని పాటించాలి. 

నీటిని వృధా చేయడం సృష్టికి, భగవత్తత్వానికి, సమస్త ప్రాణకోటికి వ్యతిరేకం. నీటిని కాపాడాలి, ప్రతి నీటి బొట్టూ విలువైందే. ఆలోచించండి... భూగోళంలో కేవలం 0.3 శాతం మాత్రమే శుద్ధనీటి వనరులు ఉన్నాయి. ఇప్పటికే చాలా భాగం కలుషితమయ్యాయి. పూర్తిగా కలుషితమైతే పరిస్థితేంటి? ముందు తరాల వారు మనకు వారసత్వంగా ఇచ్చిన నీటి వనరులను పరిరక్షించుకుని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క మనిషిపై ఉందనే విషయాన్ని గుర్తెరిగి వ్యవహరించాలి.

రాబోయే తరాలకు మనం ఇచ్చేదేంటి? అని అందరు ప్రశ్నించుకోవాలి.  నీటిని దుర్వినియోగం చేయటం..నీటి కాలుష్యానికి కారణమయ్యేవాటిని నిషేధించటం వంటి పలు అంశాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. భూమిపై మానవుడితో పాటు సమస్త ప్రాణికోటి  సుభిక్షంగా..సురక్షితంగా మనుగడ సాగించాలి అంటే నీటిని రక్షించుకోవాలి. ఇది ప్రతీ ఒక్కరి బాధ్యతగా గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచ జల దినోతవ్సం రోజున యునైటెడ్ నేషన్ సూచనలను పాటించి..ప్రతి ఒక్కరు నీటి పరిరక్షణకు బాధ్యత వహించాలి.

World Water Day
March 22
Warning
2050
Year
Former President Abdul Kalam Warning
United Nations

మరిన్ని వార్తలు