ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా, కోహ్లీ డ్యాన్స్

Submitted on 23 May 2019
World Cup 2019: Virat Kohli, Team India "Touchdown" In London

ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వరల్డ్ కప్ 2019లో ఆడేందుకు టీమిండియా ఇంగ్లాండ్ చేరుకుంది. మంగళవారం మే22న బయల్దేరిన కోహ్లీసేన అదే రోజు సాయంత్రం సమయానికి లండన్‌లో దిగింది. రెండు నెలల పాటు జరగనున్న అంతర్జాతీయ టోర్నీకి సర్వం సిద్ధమైంది. టోర్నీ మ్యాచ్‌లు కంటే ముందుగానే మే25న వార్మప్ మ్యాచ్‌లను ఆడనుంది భారత్.  

యూకేలో చేరుకున్నామంటూ కోహ్లీ సేన, టీం మేనేజ్‌మెంట్‌తో పాటు కలిసి దిగిన ఫొటోను పోస్టు చేసింది. దుబాయ్ మీదుగా ఇంగ్లాండ్‌కు బయల్దేరిన టీమిండియా ముంబై ఎయిర్ పోర్ట్ లాంజ్‌లో హల్‌చల్ చేస్తూ కనిపించింది. ఈ క్రమంలోనే కోహ్లీ తన ఫార్మల్ షూను అభిమానులకు చూపిస్తూ డ్యాన్స్ వేసిన వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోను పోస్టు చేస్తూ.. చాలెంజ్ విసిరాడు. 

'ఇది నా సిగ్నేచర్ మూవ్. మీరు దీని కన్నా బెటర్‌గా చేయగలరా? అయితే బీఎఫ్ఎఫ్ చాలెంజ్‌లో జాయిన్ అయి నాతో పాటు నిలవండి' అని పేర్కొన్నాడు. 

Virat Kohli
Team India
London
world cup 2019
cricket World Cup 2019
ICC WORLD CUP 2019
ICC Cricket World Cup 2019

మరిన్ని వార్తలు