వేలంలో నన్నేవరూ కొనరు : అదో ట్రేడ్ సీక్రెట్.. CSK సక్సెస్ మంత్రా చెప్పను

Submitted on 24 April 2019
won’t buy me at auctions if I reveal CSK’s success mantra, MS Dhoni

ఐపీఎల్ 2019లో వరుస విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రా ఏంటో తెలుసా? అదొక ‘ట్రేడ్ సీక్రెట్’ అంటున్నాడు ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. చెన్నై సూపర్ కింగ్స్ సక్సెస్ మంత్రా.. ఒకవేళ రివీల్ చేసి ఉంటే.. ఐపీఎల్ వేలంలో తనను ప్రాంఛైజీలు కొనేందుకు ముందుకు వచ్చేవారు కాదని చెప్పాడు.
Also Read : ఆయనకు ముద్దు పెడతావా : ధోనీ భార్యపై నెటిజన్లు ఫైర్

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై విజయం సాధించిన అనంతరం ధోనీ ట్రేడ్ సీక్రెట్ ను ప్రస్తావించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2018, 2011, 2010) సీజన్లలో ధోనీ కెప్టెన్సీలో చెన్నై మూడు సార్లు మెరిసింది. ప్రతి సీజన్ లీగ్ లో సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ మ్యాచ్ ల వరకు క్వాలిఫై అయింది. 2016, 2017 ఐపీఎల్ సీజన్లో చెన్నైపై నిషేధం విధించడంతో ఆ రెండు సీజన్లలో ధోనీసేన ఐపీఎల్ కు దూరమైంది. 

‘చెన్నై అభిమానుల సపోర్ట్, ఫ్రాంచైజీ సపోర్ట్ జట్టుకు ఎంతో కీలకం. సపోర్ట్ స్టాఫ్ కు సైతం భారీ క్రెడిట్ దక్కుతుంది. జట్టులో ప్రతిఒక్కరూ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టకున్నారు. జట్టులో మంచి వాతావరణం ఉండటంతో వ్యక్తిగతంగా అందరికి కలిసివచ్చింది. నేను రిటైర్ అయ్యేవరకు జట్టు సక్సెస్ కు సంబంధించి సీక్రెట్ రివీల్ చేయలేను. వరల్డ్ కప్ సమీపిస్తోంది. ఈ టోర్నమెంట్ కు ముందు నేను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది’అని 37ఏళ్ల ధోనీ చెప్పుకొచ్చాడు.  

ఐపీఎల్ సీజన్ 2019లో చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ లు ఆడితే 3 మ్యాచ్ లు ఓడి 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో చెన్నై అగ్రస్థానంలో నిలిచింది. ధోనీ సారథ్యంలో CSK మొత్తం 155 మ్యాచ్ లు ఆడితే.. 97 మ్యాచ్ లు గెలిచి 57 మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది. 
Also Read : IPL 2019 : విశాఖ వేదికగా రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు

MS Dhoni
IPL auctions
CSK
success mantra

మరిన్ని వార్తలు