పదివేలు కొట్టేసిన చోటే.. దొంగను పట్టేసింది!

Submitted on 12 January 2019
Woman Visits Same ATM For 17 Days To Catch Man who Stole money from her account

ముంబై: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన మహిళ అకౌంట్ నుంచి ఓ వ్యక్తి పదివేలు కాజేశాడు. ఏటీఎంలో నగదు డ్రా చేసే సమయంలో సాయం చేసినట్టు నటించి ఆ తరువాత ఆమె అకౌంట్లో నగదు విత్ డ్రా చేశాడు. అది తెలియని మహిళ ఆఫీసుకు వెళ్లేసరికి మెసేజ్ రావడంతో షాక్ అయింది. ఈ ఘటన ముంబైలోని బంద్రా స్టేషన్ సమీపంలోని ఓ బ్యాంకు ఏటీఎం దగ్గర జరిగింది. అసలేం జరిగిదంటే.. ముంబైకి చెందిన రెహానా షేక్ (36) అనే మహిళ డిసెంబర్ 18న నగదు విత్ డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లింది. అయితే సాంకేతిక సమస్యతో ఆమెకు ఏటీఎం నుంచి డబ్బులు విత్ డ్రా కాలేదు. ఏటీఎం డోర్ దగ్గర భూపేంద్ర మిశ్రా అనే వ్యక్తి నిలుచున్నాడు. ఇంతలో రెహానాకు సాయం చేసేందుకు లోపలికి వచ్చినట్టు నటించి ఆమె ఏటీఎం వివరాలు నోట్ చేసుకున్నాడు. డబ్బులు రాకపోవడంతో.. రెహానా అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే ఆమె అకౌంట్ నుంచి మిశ్రా పదివేలు డ్రా చేశాడు. ఆఫీసు వెళ్లేలోపు ఆమె అకౌంట్ నుంచి రూ.10 వేలు డ్రా చేసినట్టు ఫోన్ కు మెసేజ్ వచ్చింది. 

17 రోజులు నిఘా.. ఏటీఎంకు వచ్చిపోతూ..
షాకైన రహానె పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తెలివిగా వ్యవహరించింది. డబ్బులు విత్ డ్రా చేసిన ఏటీఎం దగ్గరకు వెళ్లింది. అప్పటికే అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు 17 రోజులుగా రెహానె షేక్ ఏటీఎం దగ్గరకు వచ్చి పోతుండేది. ఓ రోజున మళ్లీ ఇదే ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు భూపేంద్ర మిశ్రా వచ్చాడు. అతన్ని గుర్తించిన రెహానె.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని పట్టించింది. భూపేంద్ర పాత నేర రికార్డును పోలీసులు పరిశీలించగా.. అతడిపై ఏడు కేసులు నమోదయినట్టు గుర్తించారు. 

Bhupendra Mishra
Rehana Shaikh
ATM
Withdraw money
Stole money
bank account

మరిన్ని వార్తలు