ఆలయంలో అలజడి : గుడిలో దీపం.. చీరకు అంటుకుని మంటలు

Submitted on 20 June 2019
Woman suffers burn injuries after saree catches fire at Vishwanatha temple in Hubballi

జీవితం బాగుండాలని, కష్టాలు తీరాలని దేవుడి గుడికి వచ్చింది ఆ మహిళ. భక్తితో, శ్రద్ధగా పూజలు చేసింది. ఆలయం చుట్టూ ప్రదక్షణలు కూడా చేసింది. ఎంతో నిష్టగా చేసిన పూజల తర్వాత తిరిగి వెళ్దామని నిర్ణయించుకున్నది ఆ భక్తురాలు. వెళుతూ వెళుతూ ఆలయం ఎంట్రన్స్ లో ఉండే వినాయకుడికి చివరగా ఓ దండం పెట్టుకుని ఆ భక్తురాలు. ఆ సమయంలో అక్కడే అక్కడే ఉన్న ఓ దీపం.. ఆ మహిళ చీరకు అంటుకుంది. ఇది గమనించని ఆమె.. అలాగే వెళుతుంది. మంటలు పైకి వస్తుండటాన్ని గమనించిన కేకలు వేసింది.

కర్ణాటక రాష్ట్రం హూబ్లీలోని విశ్వనాథ ఆలయంలో ఈ ప్రమాదం జరిగింది. 2019, జూన్ 17వ తేదీ మధ్యాహ్నం జరగ్గా.. సీసీ కెమెరాలు విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. చీరకు అంటుకున్న మంటలు.. శరీరం మొత్తం వ్యాపించాయి. మహిళ కేకలకు ఆలయంలోని భక్తులు, సిబ్బంది పరుగు పరుగున వచ్చారు. ఆమె అప్పటికే ఆలయం లోపలికి పరిగెత్తింది. దుస్తులు, నీళ్లతో మంటలను ఆర్పివేశారు. వెంటనే కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆ మహిళ ఇప్పుడు చికిత్స పొందుతుంది. 

చీరకు మంటలు అంటుకున్న సమయంలో కొందరు పరిగెత్తుకుంటూ వచ్చినా.. మంటలకు భయపడి ఒకరు వెనక్కి వెళ్లారు. ఈలోపు మరికొంత మంది పరిగెత్తుకుంటూ రావటంతో.. మిగతా అందరూ కూడా మంటలను అదుపు చేశారు. ప్రస్తుతం ఆ భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని.. శరీరంపై ఎక్కువగా కాలినగాయాలు ఉన్నాయని ప్రకటించారు వైద్యులు. మెరుగైన చికిత్స అందిస్తున్నామని.. ప్రస్తుతానికి ప్రాణాలకు ప్రమాదం లేదని వెల్లడించారు. పూర్తిగా కోలుకోవటానికి సమయం పడుతుందన్నారు వైద్యులు.

Woman suffers
burn injuries
saree catches fire
Vishwanatha temple
karnataka
2019

మరిన్ని వార్తలు