వెరీ ఛీప్ : ప్లాస్టిక్ బాటిళ్లతో చెప్పులు.. ఫేస్‌బుక్‌లో సేల్‌

Submitted on 18 January 2019
Woman sells plastic thongs for Rs 1,400. The reactions are priceless

ఇంట్లో వాడేసిన వస్తువులను పారేసే ముందు ఓసారి ఆలోచించండి. పనికిరావని చులకనగా చూడకుండా వాటితో ఏదైనా అద్భుతాలు చేసి చూడండి. అందుకు న్యూజిలాండ్ మహిళే చక్కని ఉదాహరణ. క్రియేటివిటిని అవసరమైన చోట వాడితే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చునని అంటోంది ఈ మహిళ. తెలివితో వెస్ట్ మెటిరేయల్స్ తో కూడా డబ్బులు సంపాదించవచ్చునని నిరూపించింది. ఇంతకీ ఆమె చేసిన అద్భుతం ఏంటో తెలుసా? న్యూజిలాండ్ కు చెందిన మహిళా వ్యాపారి ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను పోగుచేసింది. రోడ్లపై, చెత్తకుండీల వద్ద ఎక్కడ పడితే అక్కడ ఖాళీ బాటిళ్లు కనిపిస్తుంటాయి. ఈ బాటిళ్లతో ఏదైన వస్తువు తయారు చేయాలని ఆలోచించింది. 

తన ఆలోచనకు పదునుపెట్టి చివరకు చెప్పులు తయారుచేసింది. వీటికి స్ట్రాప్స్‌ జత చేసింది. అంతేకాదు.. తయారుచేసిన ప్లాస్టిక్ బాటిళ్ల చెప్పులను ఏకంగా ఫేస్ బుక్ వేదికగా అమ్మకానికి పెట్టింది. ధర చాలా తక్కువ అంట. కేవలం 20 డాలర్లు. (రూ. 1400) మాత్రమేనని చెబుతోంది. చూడటానికి అచ్చం చెప్పుల్లా కనిపిస్తున్న ప్లాస్టిక్ బాటిల్ చెప్పులను చూసి నెటిజన్లు ఆమెను తెగ మెచ్చుకుంటున్నారు. బాటిల్ చెప్పులు సరే.. వీటిని ధరించి రోడ్లపై నడవాలా? లేదా నీళ్లపై కూడా నడవచ్చా? అని ఒకరు అంటే.. శాండిల్స్ కాదు.. జాండిల్స్ అని మరొకరు కామెంట్లు పెడుతున్నారు. మర నెటిజన్.. ఈ చెప్పులు జారేలా ఉన్నాయి.. నాకు కారు టైరుతో చెప్పులు అయితే వేసుకుంటా.. అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. 

plastic thongs
DIY project
small price
New Zealand vendor
plastics straps
empty plastic bottles   

మరిన్ని వార్తలు