పోలీస్ అధికారిణిని పెట్రోల్ పోసి తగులబెట్టాడు

Submitted on 15 June 2019
Woman Police Officer Set On Fire In Kerala, Dies; Attacker In ICU

కేరళలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న ఓ మహిళా పోలీస్‌ ఆఫీసర్‌ ని మరో పోలీసు అధికారి పెట్రోలు పోసి సజీవదహనం చేశాడు. శనివారం(జూన్-15,2019)మధ్యాహ్నాం అలప్పుజా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.అలప్పుజా జిల్లాలోని మావేలిక్కర మున్సిపాలిటీ పరిధిలోని వాలిక్కున్న పోలీస్‌స్టేషన్‌ లో సౌమ్య పుష్కరన్‌ (34)సివిల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ (సీపీఓ)గా పని చేస్తున్నారు.

శనివారం సాయంత్రం విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఆలువా ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ లో సివిల్ పోలీస్ ఆఫీసర్ గా పని చేస్తున్న అజాస్‌  కారుతో ఎదురుగా వచ్చి ఆమెను ఢీ కొట్టాడు.వెంటనే కారు దిగి ఆమెను పట్టుకోబోయేందుకు ప్రయత్నించాడు. తప్పించుకొని పారిపోతుండగా..వెంబడించి.. గొడ్డలితో దాడి చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు.

సౌమ్య బాధతో అర్తనాదాలు చేస్తుండగా.. స్థానికులు వచ్చి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే సౌమ్య మృతి చెందింది. ఈ ఘటనలో అజాస్‌ కు కూడా తీవ్రగాయాలయ్యాయి. ఆయన శరీరం కూడా దాదాపు 50 శాతం వరకు కాలిపోయింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొన్నారు. అజాస్ ప్రస్థుతం ఐసీయూలో ఉన్నాడు.
 సౌమ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.సౌమ్యకు ముగ్గురు పిల్లలున్నారు. అయితే అజాస్ ఆమెపై ఎందుకు దాడి చేశాడన్న వివరాలు ఇంకా తెలియరాలేదు.

women police officer
kerala
alappuzza
victim
soumya pusphakaran
died
petrol
Attack

మరిన్ని వార్తలు