డయల్ 100కు ఫోన్ చేసిన మహిళ : క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు 

Submitted on 7 December 2019
woman phoned the dial 100 : The cops who were safely added to her home

ప్రకాశం జిల్లాలో అభయ సేవలు ఓ మహిళకు అండగా నిలిచాయి. అడుసుమల్లి నుంచి పర్చూరు వెళ్తుండగా ఓ మహిళ స్కూటీ ఆగిపోయింది. మార్గంమధ్యలో స్కూటీ ఆగిపోవడంతో బాధిత మహిళ 100కు ఫోన్ చేసింది. వెంటనే స్పందించిన పర్చూరు పోలీసులు మహిళను గమ్యానికి చేర్చారు. క్షేమంగా ఆమెను ఇంటికి చేర్చారు. అభయ వాహనాలను ప్రారంభించిన తర్వాత తొలి ఘటన. ఇటీవలే ప్రకాశం జిల్లాలో ఏపీ ప్రభుత్వం అభయ వాహనాలను ప్రారంభించింది. 

శంషాబాద్ లో దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. నిత్యం ఏదో ఒక చోట మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి. మహిళల భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో మహిళల సేఫ్టీ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. అదే ''అభయ్ డ్రాప్ హోం సర్వీస్''. 
అభయ్ డ్రాప్ హోం సర్వీస్ ను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ డిసెంబర్ 4వ తేదీన ప్రారంభించారు.

అత్యవసర సమయాల్లో (రా.9 నుంచి తెల్లవారుజామున 5.గంటల వరకు) డయల్ 100కు ఫోన్ చేస్తే.. మహిళలను అభయ్ వాహనాల ద్వారా ఉచితంగా వారి గమ్య స్థానాలకు పోలీసులే చేరుస్తారని ఎస్పీ చెప్పారు. అభయ్ వాహనాల్లో డ్రైవర్‌తో పాటూ మహిళా కానిస్టేబుల్ ఉంటారని తెలిపారు. మహిళలను సురక్షితంగా ఇళ్లకు చేరుస్తామన్నారు. అభయ్ వాహనాలను కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తామని ఎస్పీ వెల్లడించారు.

మహిళల కోసం అభయ్ డ్రాప్ హోం సర్వీస్‌ పేరుతో ఈ వాహనాలు ప్రారంభమయ్యాయి. అత్యవసర సమయాల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని పోలీసులు మహిళలకు సూచించారు. వెంటనే అభయ్ డ్రాపింగ్ వెహికల్‌లో మహిళలను గమ్య స్థానాలకు పోలీసులే చేరుస్తారని తెలిపారు.
 

Woman
phone
dial 100
cops
safely add
her home
prakasham

మరిన్ని వార్తలు