బిగ్గెస్ట్ ఫ్యామిలీ: 13 ఏళ్లకే తొలికాన్పు.. ఆమెకు 21 మంది సంతానం!

Submitted on 9 January 2019
This woman has 21 children. She had her first pregnancy at the age of 13

ఆమెకు 13 ఏళ్లు.. అతడికి 18 ఏళ్లు.. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అదే వయస్సులో ఆమె తల్లి అయింది. తొలిబిడ్డకు జన్మనిచ్చింది. వివాహమైనప్పటి నుంచి ఇప్పటివరకూ మొత్తం 21 మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. ది బిగ్గెస్ట్ ఫ్యామిలీగా యూనిక్ వరల్డ్ రికార్డును క్రియేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది ఎక్కడో కాదు... బ్రిటన్ లో.. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో షుయ్, నోయెల్ రెడ్ ఫర్డ్ అనే బ్రిటన్ దంపతులు తమకు 21మంది సంతానం రివీల్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.

2008లో 13వ బిడ్డకు జన్మనివ్వడంతో ఈ జంట బ్రిటన్ లో ఫేమ్ అయింది. షుయో, రెడ్ ఫోర్డ్ ఆ తరువాత మరో ఎనిమిది మందికి జన్మనిచ్చారు. ఇటీవల జన్మనిచ్చిన బిడ్డతో కలిపి మొత్తం వీరి సంతానం 21కి చేరింది. ట్రెండింగ్ టాపిక్ గా మారారు. వరల్డ్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ అంటూ కొందరు అభినందనలు తెలుపుతుంటే.. మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లవిలీ కిడ్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్రిటన్ దంపతుల ఫొటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 

21 kids
Sue
Noel Redford
biggest family
Britain couple  

మరిన్ని వార్తలు