నిద్ర లేచి చూస్తే అదే నిజమైంది : ఆమె కలలో ఎంగేజ్ మెంట్ రింగ్ మింగేసింది

Submitted on 17 September 2019
Woman Dreams Of Swallowing Engagement Ring, Wakes Up To Find She Actually Did

ఆమెకు ఇటీవలే పెళ్లి కుదిరింది. కొన్నిరోజుల క్రితం ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఆమె వేలికి ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు. అంతవరకూ బాగానే ఉంది. అదే తలుచుకుంటూ ఆ రోజు రాత్రి నిద్రపోయిందా యువతి. హఠాత్తుగా ఎంగేజ్ మెంట్ రింగు మింగేసినట్టు కల వచ్చింది. వెంటనే నిద్ర లేచి చూసింది.. నిజంగానే తన ఎగేంజ్ మెంట్ రింగ్ మింగేసినట్టు తెలిసి బిత్తరపోయింది. కాలిఫోర్నియాలోని శాన్ డియోగోకు చెందిన జెన్నా ఎవాన్స్ అనే యువతికి ఈ వింత అనుభవం ఎదురైంది. 

తన అనుభవాన్ని ఫేస్ బుక్ వేదికగా పోస్టు చేసింది. ‘నేను.. నా బాబీ రైల్లో ప్రయాణిస్తున్నాం. మా ఇద్దరికి అనుకోకుండా విపత్కర పరిస్థితి ఎదురైంది. వేగంగా దూసుకెళ్తున్న రైల్లో కొందరు వ్యక్తులు మమ్మల్ని వేధించారు. చేతికి ఎంగేజ్ మెంట్ రింగును కాపాడుకోవాలంటే మింగేయాలని చెప్పారు’ అని పోస్టులో తెలిపింది. అదంతా తన కల అనుకుంది. కానీ, నిద్రలేచాక తన చేతికి ఉన్న ఎంగేజ్ మెంట్ రింగు నిజంగానే మాయం కావడంతో 29ఏళ్ల జెన్నా షాక్ అయింది. 

‘నా చేతివేలికి రింగు లేదని తెలిసింది. బాబ్ హోవెల్ ను నిద్రలేపి రింగును మింగేసినట్టు చెప్పాను’ అని ఆమె తెలిపింది. ఈ పోస్టును పెట్టిన కొద్ది గంటల్లోనే లక్ష రియాక్షన్లు, 60వేల షేర్లు అయ్యాయి. ఓ మీడియా కథనం ప్రకారం.. జెన్నాకు నిద్రలో నడిచే అలవాటు ఉందని గుర్తించింది. దీంతో ఆమెను వెంటనే అత్యవసర కేర్ క్లినిక్ కు తరలించారు. జెన్నాను పరీక్షించిన వైద్యులు.. Xray తీశారు. అందులో ఆమె కడుపులో నిజంగానే రింగు కనిపించడంతో షాక్ అయ్యారు. ఆ తర్వాత వైద్యులు అప్పర్ ఎండోస్కోపీ చేసి ఆమె కడుపులో నుంచి 2.4 క్యారెట్ల డైమండ్ రింగ్‌ను బయటకు తీశారు.

‘అంతా మంచిగానే జరిగింది. నా కడుపులో రింగ్ గుర్తించి బయటకు తీయడంతో నాకెంతో రిలీఫ్ గా ఉంది. ఆ రింగును బాబీకి ఇచ్చేశాను’ అని జెన్నా ఫేస్ బుక్ పోస్టులో ఇలా రాసుకోచ్చింది. మరో పోస్టులో ‘బాబీ.. ఈ రోజు ఉదయమే నా రింగును తిరిగి ఇచ్చాడు. మరోసారి రింగును మింగేయనని వాగ్దానం చేశాను. మేం ఇంకా పెళ్లి చేసుకుంటున్నాము. ప్రపంచంలో అంత సరిగానే ఉంది’ అని పోస్టును ముగించింది. వచ్చే ఏడాది మే నెలలో జెన్నా, బాబీ పెళ్లి చేసుకోబోతున్నారు.  

Woman
 Swallow
Engagement Ring
Jenna Evans
San Diego

సంబంధిత వార్తలు

మరిన్ని వార్తలు