బీహార్ వెళ్తుండగా : రైలులో గర్భిణీ ప్రసవం

Submitted on 21 October 2019
Woman delivery in train

రైలులో ఓ గర్భిణీ ప్రసవించింది. గౌహతి ప్రెస్ లో పాపకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బీహార్ కు చెందిన సైజాబీ అనే మహిళకు రైలులో పురిటినొప్పులు రావడంతో తోటి ప్రయాణికులే ఆమెకు డెలివరీ చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉండటంతో దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. 

ఆదివారం (అక్టోబర్ 20, 2019) సికింద్రాబాద్‌ నుంచి గౌహతి వెళ్తున్న గౌహతి ఎక్స్‌ప్రెస్ లో రైలులో గర్భిణీకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో పక్కన ఉన్న తోటి మహిళల అందరూ ఆమెకి సహాయం చేశారు. విషయాన్ని అధికారులకు తెలపడంతో అధికారులు రైలును మధిర రైల్వే స్టేషన్ లో నిలిపి తల్లి, బడ్డకు వైద్య సేవలు అందించారు. దీంతో ఆ మహిళ బిడ్డకి జన్మనిచ్చింది.

సమాచారం అందుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రైల్వే సిబ్బంది, అన్నం ఫౌండేషన్ బాధ్యుల సహకారంతో ప్రసవించిన మహిళను, పుట్టిన పాపను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. 

 

Woman
Delivery
train
konark express train
Khammam

మరిన్ని వార్తలు