వింగ్ కమాండర్ అభినందన్ వైరల్ వీడియో

Submitted on 4 May 2019
Wing Commander Abhinandan Viral Video 

ఢిల్లీ : భారత వాయుసేన వింగ్ కమాండర్, నేషన్ హీరో అభినందన్ వర్ధమాన్ తోటి ఉద్యోగులతో సరదాగా గడిపారు. వారితో సెల్ఫీలు, ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహచర ఉద్యోగులు అభినందన్ తో సెల్ఫీలు దిగటానికి ఉత్సాహం చూపించారు. ఫోటోలు దిగిన తర్వాత వారంతా భారత్ మాతాకీ జై , ఎయిర్ ఫోర్స్ కి జై అని నినాదాలు చేశారు. ఇదంతా అక్కడ ఉన్న వారు వీడియో తీశారు.

భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్.. భారత భూభాగంలోకి చొరబడిన పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టారు. 2019, ఫిబ్రవరి 27న మిగ్ 21 తో వెంబడించారు. వాటిని తరిమి కొట్టే క్రమంలో అభినందన్ యుధ్ద విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. పాక్ సైన్యం అభినందన్ ను అదుపులోకి తీసుకుంది. శత్రువుల చేతిలో బందీ అయినా అభినందన్ భయపడలేదు. అనంతరం జరిగిన చర్చల్లో భాగంగా మార్చి1న పాక్.. అభినందన్ ను భారత్ కు క్షేమంగా అప్పగించింది. అసమాన ధైర్యసాహసాలు చూపిన అభినందన్ నేషన్ హీరో అయ్యారు.

wing commander
abhinandan
Viral Video
 

మరిన్ని వార్తలు