టీడీపీలోనే ఉంటాం : స్పష్టం చేసిన కాపు నేతలు

Submitted on 20 June 2019
will stay in tdp, says Thota Trimurthulu

తాము పార్టీ మారుతున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని టీడీపీ నేత, రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు స్పష్టం చేశారు. తాము టీడీపీలోనే ఉంటామని చెప్పారు.
వైసీపీలోనో, బీజేపీలోనే చేరేందుకు సమావేశం పెట్టుకోలేదన్నారు. కాపు సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించుకున్నామని చెప్పారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై సమీక్ష కోసమే సమావేశం పెట్టుకున్నామన్నారు.

కాకినాడలో టీడీపీకి చెందిన కాపు నేతలు రహస్యంగా భేటీ కావడం కలకలం రేపింది. 20మంది మాజీ ఎమ్మెల్యేలు ఈ భేటీలో పాల్గొన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్ లో వీరంతా సమావేశం అయ్యారు. తోట త్రిమూర్తులు అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. వీరంతా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారని, పార్టీ మారబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను తోట త్రిమూర్తులు ఖండించారు. తాము పార్టీ మారడం లేదని, టీడీపీలోనే ఉంటామని తేల్చి చెప్పారు.

బూరగడ్డ వేదవ్యాస్, బోండా ఉమ, బడేటి బుజ్జి, కదిరి బాబూరావు, చెంగళరాయుడు, జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాలా గీత, మాధవనాయడు, ఈలి నాని, పంచకర్ల రమేష్ బాబు ఈ సమావేశానికి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు ఇలా భేటీ కావడం టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. వీరంతా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారే. పార్టీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా.. కాపు నేతలు ఇలా సమావేశం కావడం దుమారం రేపింది. రాజకీయంగా మార్పు రాబోతోంది అనే చర్చ జరిగింది. ఈ 20మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని తోట త్రిమూర్తులు చెప్పారు.

TDP
Kakinada
kapu leader
secret meeting
Chandrababu
Thota Trimurthulu
jyothula nehru
bonda uma
Ramachandrapuram

మరిన్ని వార్తలు